గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన మూడు రోజుల శిశుశు ఆచూకీ లభ్యమైంది.. బాలుడిని స్వాధీనం చేసుకున్న కొత్తపేట పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించిన నిందితులే.. బాలుడిని అపహరించినట్టు నిర్ధారణకు వచ్చిన కొత్తపేట పోలీసులు.. రంగంలోకి దిగి వారిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.. నిందితులు హేమవరుణ్, పద్మలు నెహ్రునగర్ కు చెందిన వారిగా గుర్తించారు.. హేమవరుణ్ గతంలో జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశారని చెబుతున్నారు..
ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన కొత్తపేట సీఐ శ్రీనివాసరెడ్డి… బాబు మిస్ అయ్యాడని ఫిర్యాదు ఇచ్చారు.. నాలుగు టీమ్ లు ఏర్పాటు చేశాం, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో గాలించామని తెలిపారు.. ఇక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని.. హేమ వరుణుడు, పద్మను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో.. అసలు విషయం బయటపడిందన్నారు.. నెహ్రూ నగర్‌లో బాబుని స్వాధీనం చేసుకున్నామని తెలిపిన సీఐ.. నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.