NTV Telugu Site icon

సాగ‌ర తీరంలో క‌రోనా క‌ల్లోలం.. 4 రోజులుగా అదే తీరు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కోవిడ్ పాజివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. ఇక‌, మ‌రోసారి విశాఖ‌ప‌ట్నంలో రికార్డు స్థాయిలో రోజువారి కేసులు న‌మోదు అయ్యాయి.. కోవిడ్ కేసుల నమోదులో మళ్లీ టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది వైజాగ్.. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల‌కు పైగానే వెలుగు చూశాయి.. గడిచిన 24 గంటల్లో 2,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మ‌రో కోవిడ్ బాధితుడు క‌న్నుమూశాడు.. ప్ర‌స్తుతం విశాఖ‌లో 15,695 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. ఇప్పటి వరకు మృతి చెందిన‌వారి సంఖ్య 1,158కు పెరిగింది.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,77,591కి పెరిగింది.. ఇక‌, 1,60,738 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. కాగా, విశాఖ మంచి టూరిస్టు ప్రాంతం.. రెగ్యుల‌ర్‌గా వ‌చ్చివెళ్లివారే సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.. రోజు ఇలా భారీ స్థాయిలో కేసులు వెలుగు చూడ‌డం ఆందోళ‌నకు గురిచేస్తోంది.

Read Also: బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన అఖిలేష్.. ఎందుకో తెలిస్తే షాకే..!