NTV Telugu Site icon

Anilkumar Yadav: 2024లో మళ్ళీ గెలుస్తాం…అంతా కేబినెట్లోకి వస్తాం

Anilnlr

Anilnlr

వైసీపీ నేతలు అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ప్రారంభం అయింది. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభమైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సభకు భారీ స్ధాయిలోవైసీపీ నేతలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

నేను ఎవరికి పోటీ కాను…నాకు నేనే పోటీ అన్నారు అనిల్. ఎవరికీ బల నిరూపణ చేయాల్సిన అవసరం లేదు. జగన్ అన్న బొమ్మతోనే ఎవరైనా ఎమ్మెల్యే గా గెలవాలి. చంద్రబాబు పొత్తు లేకుండా జగన్ ఓడిస్తామని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కాదు భిక్షం నాయక్..వచ్చే ఎన్నికల దమ్ముంటే 140 సీట్లు పోటీచేసే దమ్ము పవన్ కళ్యాణ్ కు ఉందా? వచ్చే ఎన్నికలలో మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే గా గెలుస్తాను. రేపటి నుండి గడపగడప తిరుగుతా అన్నారు అనిల్ కుమార్ యాదవ్.

Read Also:Anil Kumar Yadav: సభ నిర్వహించి తీరుతా.. ఎవరికీ పోటీగా కాదు..

నా రక్తం లో జగన్ నామస్మరణ తప్ప ఏమీ వుండదు. గతంలో మంత్రి పదవి ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నాము. ఇప్పుడు మా ఎటాకింగ్ డబుల్, త్రిబుల్ గా ఉంటుందన్నారు. ప్రతి ఎన్నికలలోను వైసీపీకి ఘనమైన విజయాన్ని అందించారు. నాతో ఎన్నికల నుండి నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు. గత ఎన్నికలలో వందకోట్లు నా ఓటమికి ఖర్చుచేసినా మీరందరూ నా గెలుపుకు పనిచేశారు. మొదట దఫాలోనే మంత్రి అవుతానని అనుకోలేదన్నారు అనిల్.

పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో140 సీట్లు పోటిచేసే దమ్ముందా..? : Anil Kumar Yadav | NTV

జగన్ ,నెల్లూరు ప్రజల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మంత్రిగా ఉండటం కంటే జగన్ అన్న సైనికుడిగా ఉండటమే ఇష్టం. మంత్రి అయ్యాక కొద్దిమంది నేతలను,కేడర్ కలవలేకపోయాను. వారందరికీ ఈ రెండేళ్ళపాటు న్యాయం చేస్తాను. యుద్దానికి తాను నమ్మకున్న సైన్యాన్నే పంపుతాడు … అలానే జగన్ అన్న మమ్మల్ని ముందుగా మంత్రులనే చేశాడు. ఇప్పుడు నాకు 42ఏళ్ళు, దేవుడి దయ, మీ ఆశ్సిసులు ఉంటే… ఇంకా 18 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటానన్నారు. జగనన్న మళ్ళీమళ్ళీ సీఎం అవుతారు… నేను మళ్ళీ మళ్ళీ అన్న ఆశ్సీస్సులతో మంత్రిని అవుతాను. నాకు ఎమైనా అరవై ఏళ్ళ పదవి పోయిందా బాధపడటానికి అన్నారు అనిల్ కుమార్ యాదవ్.

సభ సాక్షిగా మంత్రి కాకాణి పై తన వైఖరి చెప్పకనే చెప్నారు అనిల్. మంత్రిగా తనకు సహకరించారని .. వారందరికీ ధన్యవాదాలు అంటూ నెల్లూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే ల పేర్లు చెప్పిన అనిల్ కుమార్ యాదవ్.. కాకాణి.. అనం రామనారాయణ రెడ్డి పేర్లను ప్రస్తావించలేదు. ఇటీవల మరణించిన మంత్రి గౌతమ్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు అనిల్.