Site icon NTV Telugu

Andhra Pradesh: చర్చిల అభివృద్ధికి రూ.175 కోట్ల నిధులు.. ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి కేటాయింపు

Ap Church

Ap Church

Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చర్చిల అభివృద్ధికి రూ.175 కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ నిధులను చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం వినియోగించనుంది. ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటి మేర అందించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, స్మశాన వాటికల ఆధునీకరణకు ఈ నిధులు వెచ్చించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలలో అదనంగా మరో రూ.కోటి విలువైన పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Gold Rate Today: రాకెట్‎లా దూసుకెళ్లిన బంగారం ధర.. ఏకంగా 7నెలల గరిష్టానికి పెంపు

కాగా చర్చిలకు కేటాయించే నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్ధిక సంస్థ ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం కలెక్టర్లు తమ జిల్లాలలో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 19లోగా ప్రతిపాదనలు అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. దాదాపు 200 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

Exit mobile version