116 Year Old Woman: భక్తికి వయసుతో పనే లేదని నిరూపించింది ఒక శతాధిక వృద్ధురాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిపై ఉన్న అమితమైన భక్తి ఆ బామ్మను అసాధ్యమైన మైలురాయిని అధిగమించేలా చేసింది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు.. తన కుటుంబ సభ్యుల తోడుతో తిరుపతిలోని అత్యంత కఠినమైన అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల కొండకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. శేషాచలం కొండల్లో దాదాపు 9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అలిపిరి కాలినడక మార్గంలో సుమారు 3550 మెట్లు ఉంటాయి. యువకులే ఈ మెట్లు ఎక్కడానికి ఆయాసపడిపోతుంటారు.
అలాంటిది 116 ఏళ్ల వయసును సైతం లెక్కచేయకుండా, కేవలం ఆ ఏడుకొండలవాడిపై ఉన్న అచంచలమైన విశ్వాసంతో ఆమె ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. స్వామివారిని దర్శించుకోవాలనే బలమైన సంకల్పమే ఆమెను ఈ వయసులోనూ ముందుకు నడిపించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ బామ్మగారి అద్భుతమైన తిరుమల యాత్రకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వయసు భారమైనా, గుండె నిండా భక్తితో ఆమె వేసిన ప్రతి అడుగు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
116-year-old devotee’s faith inspires all. An old woman from Karnataka reached the hill abode of #LordVenkateswara atop the #Tirumala hills in Tirupati on foot with the support of her family, climbing the challenging Alipiri footpath of around 3550 steps spread over nearly 9 km… pic.twitter.com/kZip81MV1n
— Ashish (@KP_Aashish) July 4, 2026

