మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు.. విద్యాలయాల్లోనూ తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి… తాజాగా, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు కస్తూరిబా పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది… టీచర్ల వేధింపులను భరించలేక ఈ నెల 16వ తేదీన స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది టెన్త్ విద్యార్థిని… దీంతో, ఆ విద్యార్థినిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన టీచర్లు… ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడినట్లు బాధిత విద్యార్థినితో ఒత్తిడి తెచ్చి తెప్పించారు.. అయితే, వారం తర్వాత టీచర్లు వేధింపులకు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టింది విద్యార్థిని.
Read Also: Sadhvi Niranjan Jyoti: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?
హాస్టల్‌లో తనతో పాటు ఇతర విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా బహిర్గతం చేసింది.. హాస్టల్‌లో టీచర్ల కాళ్ళు, చేతులు నొక్కాలి… తలకు ఆయిల్ వేసి మసాజ్ చేయాలని.. ఇతర వ్యక్తిగత పనులు కూడా చేయించుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది.. ఇక, చెప్పిన పనులు చేయకపోతే టార్గెట్ చేసి టీచర్లు వేధించేవారని కన్నీరుమున్నీరైన ఆమె.. ఆస్పత్రిలో నిజం చెప్పనీయకుండా అడ్డుకున్నారని.. టీసీ ఇచ్చి పంపిస్తాం.. ఎక్కడా చదువుకోకుండా చేస్తామని బెదిరింపులకు దిగారని వారి గుట్టు మొత్తం విప్పింది. తాను పడ్డ వేధింపులు స్నేహితులు ఎవ్వరూ పడకూడదు.. వేధించిన టీచర్ల పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది బాధిత విద్యార్థిని.. ఇక, టెన్త్ విద్యార్థిని స్వప్న ఆత్మహత్యాయత్నంపై త్రీసభ్య కమిటీ విచారణ జరపగా.. వారి ముందు విస్తుపోయే విషయాలు బయటపెట్టింది ఆమె.