NTV Telugu Site icon

108 Services: ఏపీలో పనిచేయని 108 సర్వీస్.. మరి ఏ నంబర్‌కు కాల్ చేయాలి?

108 Services

108 Services

108 services not working due to technical probelem: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హెల్త్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసుల‌కు అంత‌రాయం క‌లిగింది. స‌ర్వర్‌లో టెక్నిక‌ల్ ఇష్యూస్ కార‌ణంగా ఏపీలోని 108, ఇత‌ర అత్యవసర స‌ర్వీసెస్ ఫోన్ నెంబ‌ర్ తాత్కాలికంగా ప‌నిచేడం లేద‌ని 108, 104 స‌ర్వీసెస్ అడిష‌నల్ సీఈవో ఆర్‌. మ‌ధుసూద‌న రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ కావాల్సిన వారు, వైద్య సాయం కోసం అంబులెన్స్ సర్వీస్ కావాలంటే 104(1) కి ఫోన్ చేయాల‌ని ఏపీ ప్రజలకు సూచించారు. 108 సర్వీస్‌కు సంబంధించిన సర్వర్‌లో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆర్.మధుసూదనరెడ్డి తెలిపారు.

Read Also: Viral News Of Gst Bills: షాపింగ్ మాళ్లలో ఇలా చేస్తే.. జీఎస్టీ పడదా?

కాగా ఏపీలో అత్యవసర వైద్య సేవలు, పోలీస్, ఫైర్ ఎమర్జెన్సీ సేవల కోసం 108 నంబర్‌ను ప్రభుత్వం కేటాయించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ఉన్న కార్యాలయం నుంచి 108 సేవలను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. అయితే శనివారం ఉదయం నుంచి టెక్నికల్ సమస్యల కారణంగా 108 సర్వీస్ నంబర్ పనిచేయడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడకుండా మరో నంబర్‌ను కేటాయించారు. 108 నంబర్ పనిచేయనప్పటికీ అంబులెన్స్ సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు వివరించారు. అటు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం గతంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏకంగా మండలానికొక 104, 108 వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 18.03 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 19.21 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 24.50 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 27:23 నిమిషాల్లో అంబులెన్సులు ఘటనా స్థలికి చేరుకుంటున్నాయి.

Show comments