తూర్పుగోదావరి : కోనసీమలో కరోనా కలకలం రేపుతోంది.. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలోనే అమలాపురం డివిజన్ పరిధిలో ఏకంగా 10 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో ఒక సిఐ, ఐదుగురు ఎస్ ఐ లకు నలుగురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కోనసీమలో దసరా ఉత్సవాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఆందోళనల బందోబస్తులో పాల్గొన్న పోలీసులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. కరోనా సోకిన పోలీసులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు అమలాపురం డిఎస్పీ మాధవరెడ్డి. కరోనా సోకిన పోలీసు సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారన్నారు. వాళ్ళ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని…. ఎవరికి సీరియస్ గా లేదని వివరించారు.
