Woman Gave Birth on The Train Track: రైలు పట్టాలపైనే ప్రసవించిన మహిళ..
- రైలు పట్టాలపైనే ప్రసవించిన ఒడిశాకు చెందిన మహిళ..
- బరంపుర్ నుంచి సూరత్ కు వెళ్తుండగా రైలులో పురిటి నొప్పులు..
- పార్వతీపురం బెలగాం రైల్యే స్టేషన్లో దించిన కుటుంబ సభ్యులు..
- ఆసుపత్రికి తరలిస్తుండగా పట్టాలపై ప్రసవించిన ప్రియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Gave Birth on The Train Track: రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మహిళ రైలు పట్టాలపైనే ప్రసవించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం బరంపుర్కు చెందిన ప్రియాపాత్ర అనే మహిళ బరంపుర్ నుంచి సూరత్‌కు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తోంది.. అయితే, రైలు ప్రయాణంలో ప్రియాపాత్రకు తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లాలోని బెలగాం రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి దించారు. ఇక, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే, రైల్వే పట్టాలపైనే ఆమె ప్రసవించింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆటో ద్వారా ప్రియాపాత్రను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, స్థానికులు సమయానికి సహకరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.
Read Also: SA20 2026: అభిమానికి గాయం.. క్షమాపణతో పాటు సంతకం చేసిన జెర్సీ గిఫ్ట్..!
Also Read
- Tomato Price Crash: భారీగా పతనమైన టమాటా ధర.. తీవ్ర నిరాశలో రైతన్నలు..
- Family Suicide: ఏం కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి, ఒకరికి సీరియస్..
- Tourist Rush in Araku Valley: అరకు లోయకు పోటెత్తిన పర్యాటకులు.. హోటల్స్ అన్ని హౌస్‌ఫుల్
- Elephant Crosses Road: మన్యం జిల్లాలో ఏనుగుల కలకలం.. భయాందోళనలో స్థానికులు..
తాజావార్తలు
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్‌బక్స్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్‌పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!