రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖర్ (78) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. పాలవలస కుటుంబం కాంగ్రెస్ తర్వాత వైసీపీలో కొనసాగుతుంది. పాలవలస రాజశేఖర్ 1994లో ఊనుకూరు ఎమ్మెల్యేగా , రాజ్యసభ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. పాలవలస రాజశేఖర్ కూతురు రెడ్డి శాంతి పాతపట్నం మాజీ ఎమ్మెల్యే.. కుమారుడు పాలవలస విక్రాంత్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.
AP: రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖర్ మృతి..
- రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖర్ (78) కన్నుమూత
- కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలవలస
- శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి.