NTV Telugu Site icon

జ‌ల‌వివాదంః నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టువ‌ద్ద ఉద్రిక్త‌త‌…

గ‌త కొంత‌కాలంగా తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం న‌డుస్తున్న‌ది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి నీటి విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున అప్ప‌ట్లో ఉద్యమాలు చేశారు.  తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో నీరు, ప్రాజెక్టులు కీల‌క పాత్ర పోషించాయి.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి ఏడేళ్లు గ‌డిచినా ఇంకా జ‌ల‌వివాదాలు జ‌రుతూనే ఉన్నాయి.  ఏపీలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌లపై తెలంగాణ ప్ర‌భుత్వం అభ్య‌తరం తెలిపింది.  

Read: డాక్టర్స్ కు సెల్యూట్ చేస్తున్న స్టార్ హీరోలు

ఇక‌, ఇదిలా ఉంటే, మాచ‌ర్ల‌లోని నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టులో తెలంగాణ స‌ర్కార్ పూర్తిస్థాయిలో జ‌ల‌విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  తెలంగాణ స‌ర్కార్ అక్ర‌మంగా విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ద‌ని, త‌క్ష‌ణ‌మే విద్యుత్ ఉత్ప‌త్తిని నిలిపివేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తున్న‌ది.  నాగార్జున సాగ‌ర్‌కు ఇరువైపుల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన పోలీసులు మోహ‌రించారు.  పెద్ద సంఖ్య‌లో పోలీసులు మోహ‌రించ‌డంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త‌లు నెలకొన్నాయి.