NTV Telugu Site icon

ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్‌ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జలవిహారం నిలిపివేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్‌, పున్నమిఘాట్‌ నుంచి భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాలను తిలకించారు.

also read: గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి