NTV Telugu Site icon

Shrimp Farming : రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Royyalu (2)

Royyalu (2)

రైతులు మత్స్య పరిశ్రమ వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు.. ఎక్కువ మంది రైతులు చేపలు, రొయ్యల పెంపకం ను చేపడుతున్నారు.. అయితే ఇందులో మంచి ఆదాయాన్ని పొందాలంటే పిల్లల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి.. ముఖ్యంగా చలికాలంలో వాతావరణ ఇబ్బందులకు తోడు తొందరగా వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రొయ్యలు పెంచాలనుకునే రైతులు ఎలాంటి పిల్లలను ఎంపిక చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్నేళ్ల క్రితం అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టిన రొయ్యల పెంపకం ఇప్పుడు నష్టాల్లో నడుస్తుంది.. హేచరీల నుండి సరైన సీడ్ లభ్యంకాక పోవడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు రొయ్యల సీడ్ ను హేచరీల వద్ద నుండి కొనేటప్పుడు ఖచ్చితంగా ఆ సీడ్ ను ల్యాబ్ లలో టెస్ట్ చేయించు కోవాల్సిఉంటుంది. టెస్టులు చేయించకుండా సీడ్ ను చెరువుల్లోకి వదలడం వల్ల పిల్లలు చనిపోవడం లేదా సరిగ్గా ఎదగక పోవడం తో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు..

ఇకపోతే ఎక్కువ శాతం మంది రైతులు హేచరీలను గుడ్డిగా నమ్మి ఎటువంటి టెస్టులు చేయించకుండా సీడ్ ను.. కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతున్నారు. దీనివల్ల రైతులు సీడ్ వేసిన కొద్దిరోజుల్లోనే రొయ్యపిల్ల ఆక్సిజన్ అందక చనిపోతుంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. చెరువులో సీడ్ వేసేముందు చెరువులోని నీటిని కూడా పరీక్ష చేయించాల్సి ఉంది . సీడ్ ను కొనుగోలు చేసేటప్పుడు హేచరీ యజమానులు చూపించే ల్యాబ్ రిపోర్టులపై నమ్మకం పెట్టుకోకుండా సీడ్ ను టెస్ట్ చేసి నాణ్యమైన సీడ్ ను మాత్రమే ఎంపిక ఖచ్చితంగా ఉండాలి.. అందుకే రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవడం కోసం రైతులు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..