Peas Cultivation : బఠాణి సాగులో అధిక దిగుబడి పొందాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బఠాణిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటున్నారు.. దాంతో ఏడాది పొడవునా మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఎన్నో పోషక విలువలు ఉంటాయి..మన రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు..ఈ పంట ను పండించే ముందు నేల పరీక్ష చేయించాలి.. ఎటువంటి రకాలు మంచి దిగుబడిని పెంచుతాయో తెలుసుకోవాలి.. ఈ పంట సాగులో అధిక దిగుబడి పొందాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బఠాణిలో మూడు రకాల విత్తనాలు ఉన్నాయి.. అవేంటంటే.. స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక..
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
ఎర్లీబాడ్గర్: ముడతలు గల గింజలతో కూడిన పొట్టిరకం. 55 నుండి 60 రోజులలో కోతకు వస్తుంది.
అర్మెల్: ముడతలు గల గింజలతో కూడిన అధిక దిగుబడినిచ్చే పొట్టి రకం. 60 రోజులలో ఆకుపచ్చని కాయలతో కోతకు వస్తుంది.
మీటియర్: బుతువులో ముందుగా వేయుటకు అనుకూలమైన రకం. విత్తనాలు నునుపుగా వుంటాయి. 60-65 రోజులలో ఆకుపచ్చని కాయలతో కోతకు సిద్ధంగా వుండే రకం.
జవహార్ మటర్-4: మొక్కలు పొడవుగా, కాయలు మధ్యస్థంగా వుంటాయి. గింజలు ఆకుపచ్చగా, పెద్ద సైజులో ముడతలు కలిగి ఉంటాయి. దిగుబడి ఎకరాకు 24 క్వింటాళ్ళు.
హిస్సార్ హరిత్: కోతకు 60 రోజులలో సిద్ధమవుతుంది. కాయలు గింజలతో పూర్తిగా నిండి ఉంటాయి… ఇది మొదటి రకంలో విత్తనాలు..
బోర్న్‌విల్లీ: బుతువు మధ్యలో వేయుటకు అనువైన రకం. ఎక్కువ ఎత్తు పెరగదు. గింజలు ముడతలు కలిగి ఉండి తియ్యగా వుంటాయి. 85 రోజులలో కోతకు వస్తుంది. పచ్చికాయదిగుబడి ఎకరాకు 40 క్వింటాళ్ళు.
జవహార్ మటర్-1 ;. కాయలు పెద్దవిగా ఆకర్షణీయంగా, చివర వంపు కలిగి ఉంటాయి. దిగుబడి ఎకరాకు 48 క్వింటాళ్ళు
జవహార్ మటర్-2: గింజలు పెద్దవిగా ముడతలు కలిగి ఉంటాయి. దిగుబడి ఎకరాకు 40 క్వింటాళ్ళు.
ఐ.పి.-8: మధ్యస్థ రకం. కాయలు మధ్యస్థం. ఏడు గింజలు కలిగి ఉంటాయి.. ఎకరాకు 110 క్వింటాల్లా దిగుబడిని ని పొందండి..
ఎన్.పి.-29: మొక్కలు ఎత్తుగా ఎదుగుతాయి. ముడతలు పడిన గింజలుగల రకం. 100 రోజులలో కోతకు వస్తుంది.
ఇవి కాక ఆజాద్-పి-1 ఆజాద్ పి-2 మరియు బూడిద తెగులును తట్టుకునే రకాలు కూడా సాగుచేసుకొనవచ్చు.
ఆఖరి దుక్కిలోఎకరాకు 8 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. అనుకూలంగా బోదెలు, కాలువలు చేయాలి. నేలను సమానంగా మొలక రావడానికి అనుకూలమైన స్థితిలో వుంచాలి. విత్తన మోతాదు, విత్తేదూరం, ఎకరాకు స్వల్భకాలిక రకాలకు 40-48 కిలోలు.. విత్తే దురాన్ని బట్టి నాట్టుకోవాలి.. అలాగే కలుపు నివారణ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండేలా చూసుకోవాలి.. అక్టోబర్, నవంబర్ మాసాలలో విత్తు కోవచ్చు..కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండజిమ్ చొప్పున కలిపి విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఎకరాకు 10 కిలోల నత్రజని, 28 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌లను విత్తే సమయంలో వేయాలి. భాస్వరం, పొటాష్ ఎరువులు బఠాణీలో నత్రజని స్థాపించే సామర్ధ్వాన్ని పెంచుతాయి… తెగుళ్ల బెడద నుంచి ఉపశమనం కలుగుతుంది.. ఏదైనా తెగుళ్లు సోకినట్లయితే వెంటనే మందులను వాడాలి.. ఇంకేదైనా సందేహాలు ఉంటే వెంటనే వ్యవసాయా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!