NTV Telugu Site icon

Lily Cultivation: లిల్లీ సాగులో అధిక దిగుబడి పొందాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Pink Lilies

Pink Lilies

మన దేశంలో పూలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. సువాసనలు వెదజల్లే పూలతో ఎన్నో రకాల సౌందర్య సాధనాలను, అత్తర్లు వంటి వాటిని తయారు చేస్తారు.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈరోజు లిల్లీ పూల సాగులో అధిక లాభాలను పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సువాసన లాభాలతో రైతుల మనస్సును మైమరిపిస్తోంది. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడంతో సంప్రదాయ పంటలను వదిలిపెట్టి ఉద్యాన పంటలను ఎంచుకుంటున్నారు యువరైతులు.. చీడపీడల లేని లిల్లీ సాగును ఎంచుకుంటున్నారు. దీంతో కొంతమంది రైతులు లిల్లీ పంటతో మంచి దిగుబడులను సాధిస్తు మార్కెట్లో లాభాలను అర్జిస్తున్నారు. అసలు లిల్లీ పంటకు ఎలాంటి నేలలు అవసరం, దానికి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే వివరాలను తెలుసుకుందాం..

ఈ పంటను ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకు సాగు వస్తుందని నిపుణులు అంటున్నారు..ఈపంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలల, ఎర్ర గరప నేలలు, వీటి సాగుకు చక్కటి అనుకూలంగా ఉంటాయి. పంట వేసిన పొలంలో నీరు నిల్వ ఉండకుండా మురుగు నీటి వసతి కల్పించాలి. లేకుంటే అనేక రకాల వ్యాధులు వ్యాపించి దిగుబడి తగ్గే అవకాశం ఉంది.. లిల్లీ పూలను అలంకరణలోను, బొకేలు, సుగంధ తైలాలు ఉత్పత్తిలోనూ అధికంగా వినియోగిస్తారు.. ప్రపంచ వ్యాప్తంగా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటాయి.. ఎకరానికి 60వేల నుంచి 70వేల దిగుబడి వస్తుంది. లిల్లీ పూలను తామర పురుగులు, పేనుబంక, మొగ్గ తొలుచు పురుగు, నెమటోడులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది.. వర్షాకాలంలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పంట గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు..