NTV Telugu Site icon

Karonda Cultivation: వాక్కాయల సాగుతో అదిరిపోయే లాభాలు..

Vakkaya

Vakkaya

వాక్కాయాలతో ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.. అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. అందుకే రైతులు కూడా వీటిని పండించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక దిగుబడులను ఒక్క ఆహార పంటల ద్వారా రైతులు వ్యవసాయంలో పొందలేకపోతున్నారు.. అందుకే తక్కువ సమయంలో అధిక లాభాలను ఇచ్చే పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు.. వాక్కాయ సాగుతో రైతులు అధిక రాబడిని పొందుతున్నారు.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

థాయిలాండ్‌ వెరైటీ మొక్క నాటిన మొదటి ఏడాది నుంచే కాపు అందుకుంటుంది. నేలమీదా, కుండీల్లోనూ అన్ని చోట్ల దీనిని పెంచుకోవచ్చు. ఎర్రమట్టి నేలల్లో శ్రీఘ్రమైన కాపు ఉంటుంది. వారానికి ఒకరోజు నీటివనరులు అందిస్తే సరిపోతుంది. సాధారణంగా వాక్కాయ మొక్క అక్కడక్కడా ముళ్ళుండే పొద జాతి, కంప మొక్క…విదేశీ మొక్కలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి..వీటిలో అధికంగా విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, ఫైబర్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, అంథోసైనిన్స్‌, ఫినోలిక్‌ యాసిడ్స్‌, అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ పాలిఫినల్స్‌ వలన కణాలు దెబ్బతినకుండా, ఇన్ఫెక్షన్లకు రాకుండా రక్షిస్తుంది. తినుబండారాలలో వాడే చెర్రీ పండ్లు ఈ పండ్ల నుంచి తయారుచేస్తారు.. అందుకే ఇవి చాలా ఖరీదైనవి..

బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు తన కున్న మొత్తం పొలంలో ఈ వాక్కాయాలను సాగు చేస్తున్నాడు..పొలం గట్టుపై వేస్తే కంచెగా ఉంటుందని రైతులు భావించారు. పొలంలో గట్టుపై దీనిని నాటారు. పెరిగాక దాని కాయలను విత్తనాలుగా మార్చి ఎకరం పొలంలో సాగు చేస్తే లాభాలు రావడంతో ప్రస్తుతం 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 200 మొక్కలు నాటవచ్చు.. అలా ఆ ప్రాంతం అంతా తొలి ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా చెట్టు పెరిగే కొద్దీ దిగుబడి పెరిగిందని రైతులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఒక చెట్టుకు 25 నుంచి 30 కిలోల వాక్కాయలు వచ్చాయి. ఎకరానికి సుమారు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ధర కిలో రూ.50 ఉంది. అడవి జాతి మొక్క కావడంతో పెట్టుబడి ఖర్చు తక్కువ.. ఒక్కసారి నీరు పెడితే చాలు మొక్కలు అవే పెరుగుతాయి.. చెర్రీ పండ్లను వీటితో తయారుచేస్తారు.వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా వాక్కాయలతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు.. సో ఈ పంటను వ్యవసాయ నిపుణుల సలహాతో పండించవచ్చు..