NTV Telugu Site icon

Jasmine Pruning: మల్లెలో కొమ్మ కత్తిరింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Jasmine

Jasmine

మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో మల్లె పూలు కూడా ఒకటి.. వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు.. అందుకే రైతులు మల్లెపూలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.వాణిజ్య సరళిలో చేపట్టే ఈ మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తున్నారు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారాగానీ ప్రవర్ధనం చేయవచ్చు. మల్లెలకు వచ్చే సువాసనలు ఏపువ్వులకు రావు. దాని అందం కూడా వేరు…

ఈ మల్లెల్లో మూడు రకాలు ఉన్నాయి.. గుండు మల్లెలు., జాజిమల్లెలు, కాగాడా మల్లెలు.. సాధారణంగా మల్లి నాటిన మూడో సంవత్సరం నుండి వ్యాపార సరళిలో దిగుబడి ప్రారంభమై 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తోంది జనవరి నెల నుంచి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి తోపాటు పూల నాణ్యత బాగుంటుంది.. కొమ్మ కత్తిరింపుల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు.. కత్తిరింపు తర్వాత పది రోజులకు నీటిని ఇవ్వాలి.. నేల స్వభావాన్ని బట్టి ఐదు-ఆరు రోజులకు ఒకసారి పూలు కోసే సమయంలో నీరు పారించాలి. కత్తిరింపులు పూర్తి అయినా తరువాత మొదటి తవ్వకం చేసిన వారం రోజులు తర్వాత ఒక్కొక్క చెట్టుకు 10కిలోల పశువుల ఎరువు 500 గ్రాములు వేప పిండి లేదా ఆముదపు పిండి, 200 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్, 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్పెట్, 75 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ను చెట్టు చుట్టూ చిన్న గాడి తీసి అందులో వేసి మట్టితో కప్పించి నీరు పారించాలి..

మల్లె మొగ్గల్ని ఉదయం 11 గంటలలోపు కోసి మార్కెట్ కు చేరేలా చెయ్యాలి.. ఇక దూరప్రాంతాల కొరకు వెద్దరు బుట్టలను కార్డ్ బోర్డ్ పెట్టెలను వాడవచ్చు. తాజాదనం కోసం పూసిన మొగ్గలు ఎక్కువ కాలం నిలువ ఉండి తాజా సుహాసనలు రెండు మూడు రోజులు వెదజల్లుతుండాలంటే లీటర్ నీట్ గా 10 గ్రాముల సుక్రోస్ లేదా 50 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా ఒక గ్రా అల్యూమినియం సల్పెట్ కలిపిన ద్రావణం లో పది నిమిషాల నుంచి ఆరబెట్టి తర్వాత ప్యాకింగ్ చేయాలి.. అలా చేస్తే ఫ్రెష్ గా, మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి.. మల్లెలు ఎంత ఫ్రెష్గా ఉంటే మార్కెట్ లో అంత డిమాండ్ ఉంటుంది..