NTV Telugu Site icon

Cocoa Cultivation: కాసులు కురిపిస్తోన్న కోకో.. ఆ రైతు అనుభవం..

కోకో పంట కాసులు కురిపిస్తోంది.. అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉన్న పంట కూడా ఇది.. చాక్లెట్లు, కాఫీ, కేకుల తయారీలో కోకో వినియోగిస్తారు.. క్రమంగా చాక్లెట్లు, కాఫీ, కేకుల కల్చర్‌ కూడా పెరిగిపోతుండడంతో.. ఆ పంట వేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి… కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా దీనిని సాగుచేస్తున్నారు రైతులు.. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది… భారత్‌లో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ పంట సాగుతున్నారు.. ఇక, ఈ పంటను పండిస్తున్న ఓ రైతు అనుభవాన్ని మీ ముందు ఉంచుతాం..

Read Also: Arvind: కాంగ్రెస్‌తో దోస్తీ కోసం.. కేసీఆర్‌ దస్తీ వేసిండు..! రేవంత్ జాగ్రత్త..!

పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రావు అనే రైతు.. కొన్ని ఏళ్లుగా ఈ పంటను సాగుచేస్తున్నారు.. తమ ప్రాంతంలో కోకో పంట గురించి ఎవ్వరికీ తెలియని సమయంలో తాము సాగు ప్రారంభించామన్నారు.. తమ భూమిలో ఈ పంట ప్రారంభించక ముందు.. మమ్మల్ని పోషించేది కాదు.. కానీ, తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు.. అన్ని పంటల్లో లాభ నష్టాలు ఉంటాయి.. కానీ, జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని చెబుతున్నారు.. అసలు, కోకో పంటలో ఉన్న సవాళ్లు ఏంటి? ఎలా సాగు చేయాలి? కొబ్బరి, కోకోకు ఉన్న లింక్‌ ఏంటి..? సాగు పద్ధతులు ఏంటి..? మంచి మార్కెట్‌ రావాలంటే ఏం చేయాలి..? దాని వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి..? మంచి రేట్‌ రావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటి? రైతు శ్రీనివాస్‌ రావు మాటల్లో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..