కరోనా కాలంలో మనిషి సాటి మనిషిని పట్టించుకోవడం మర్చిపోయాడు. తను ఉంటే చాలు అనుకుంటున్నాడు. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు చేసిన సాహసం అందరిచేత చప్పట్లు కొట్టించింది. ఓ ప్రాణికి ప్రాణం పోసింది. ఇంతకీ ఆ యువకుడు చేసిన సాహసం ఏంటో తెలుసా…. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో ఉన్న ప్రాణికి ఊపిరి అందివ్వడమే. అందులో స్పెషల్ ఏముంది అనుకుంటే పొరపాటే.
Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం : వారికి మొబైల్ ఫోన్స్
మాములు మనిషికైతే దానిగురించి అంతటి చర్చ జరిగేది కాదు. ఆ యువకుడు ఊపిరి అందించింది ఓ పాముకు. ఊపిరి అందక అపస్మారక స్థితిలో పడున్న పాము నోరు తెరిచి స్ట్రాను ఉంచి ఊపిరి ఊదాడు. కాసేపటికి ఆ పాము తేరుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియకున్నా, సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతున్నది. పాముకు ఊపిరి అందించిన యువకుడిని నెటిజన్లు శభాష్ అని మెచ్చుకుంటున్నారు.