Site icon NTV Telugu

Expensive Water Bottle: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఇదే.. ధర రూ.50 లక్షలు..!

Water Bottle

Water Bottle

World’s Most Expensive Water Bottle: ఓ లీటరు మంచినీళ్ల బాటిల్ ధర రూ.20కు దొరుకుతుంది. ప్రాంతాన్ని బట్టి దాని ధర కూడా మారుతుంది. కంపెనీని బట్టి, అందులోని వాటర్ ని బట్టి బాటిల్ ధర పెరుగుతుంది. సెలబ్రెటీలు తాగే వాటర్ ధర అధికంగా ఉంటుంది. ఈ మధ్య ‘బ్లాక్‌ వాటర్‌’ అని ఓ కొత్తరకం నీళ్లొస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ దగ్గర్నుంచి శృతి హాసన్‌, మలైకా అరోరాలాంటి సెలబ్రిటీలు అందరూ ఆరోగ్యానికి మంచిదంటూ వీటిని తాగుతున్నారు. దీని ధర లీటరుకు రూ.3 వేల నుంచి 4 వేలు ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఏది? దాని ధర ఎంత? అని ఎప్పుడైనా ఆలోచించారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Saudi hero: ఆ వ్యక్తి ధైర్యసాహసాలకు సౌదీ రాజు ఫిదా.. ఎన్ని మిలియన్ రియాల్స్ గిఫ్ట్ అంటే

ఒక బ్రాండ్ వాటర్‌ మాత్రం, భూమిపై లభించే వాటిలో అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. అదే ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని (Aqua di Cristallo Tributo a Modigliani)’. ఈ వాటర్ ఒక లీటర్ కొనాలంటే కోటీశ్వరులు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే దీని ధర ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని అనేది మనం రోజూ తాగే కామన్ వాటర్‌ కాదు. ఇది గోల్డ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. దీని ధర ఒక 750 ml బాటిల్ దాదాపు రూ.50 లక్షల రూపాయలు (సుమారు $60,000 USD). ఆ ధరకు ఒక ఫ్యాన్సీ కారు, ఇల్లు లేదా బంగారం, వజ్రాలను కూడా కొనుగోలు చేయవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ వాటర్ కొని తాగుతారు.

Exit mobile version