NTV Telugu Site icon

World Biggest Snake: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. వీడియో చూస్తే వణికిపోవడం పక్కా

World Biggest Snake

World Biggest Snake

World Biggest Snake: సోషల్ మీడియాలో ఓ వీడియో నెటిజన్లకు షాక్ కు గురిచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద పాము ఏది అని అడిగితే పిల్లలు కూడా ‘అనకొండ’ అని సమాధానం చెబుతారు. అనకొండలు దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ కొండచిలువ నీటిలో, భూమిపై ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము అనకొండ కాదని కానీ అంతకంటే పెద్ద, పొడవైన పాము ఈ భూప్రపంచంలో ఉంది. అదే ‘రెటిక్యులేటెడ్ పైథాన్’. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఒకటి ప్రజలకు వణికి పుట్టిస్తోంది.

Read also: BSS10: శ్రీనివాస్ బెల్లంకొండ పదో చిత్రం ఎవరితో అంటే….

అయితే అధికారికంగా ఈ సమాచారం ఎంతవరకు ప్రామాణికమైనదో స్పష్టంగా తెలియలేదు. సైన్స్ గర్ల్ అనే ట్విటర్ పేజీ ద్వారా వీడియో షేర్ చేయబడింది. ఇదిలా ఉంటే, వీడియోలో కనిపిస్తున్న పాము నిజంగా చాలా పెద్దది అతి భయానకంగా ఉంది. చాలా మంది ఈ వీడియో చూసి భయపడి, ఇతరులను చూడవద్దని సలహా ఇస్తున్నారు. ఈ కొండచిలువ నలుపు రంగులో ఉంది. ఇది రెటిక్యులేటెడ్ జాతికి చెందినది. రెటిక్యులేటెడ్ పైథాన్ దక్షిణ, ఆగ్నేయాసియాలో ఉన్న ఏకైక పైథాన్ జాతి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన .. మూడు బరువైన పాములలో ఇది ఒకటి. ఈ ఘటన ఎక్కడ జరిగింది, పాము ఎక్కడుంది, ఆ వివరాలన్నీ ఇంకా తెలియరాలేదు. వీడియోలో కనిపిస్తున్నట్లుగా, పాము ఒక గది నుండి మరొక గదికి కదులుతోంది. ఆ చిన్న దూరాన్ని దాటేందుకు ఆ పాము చాలా సమయం తీసుకుంటోంది. అయితే ఈజాతికి చెందిన పాములు 1.5 నుండి 6.5 మీ (4.9 నుండి 21.3 అడుగులు) పొడవు.. 75 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇటువంటి పొడవైన భారీ తాడులు షాన్డిలియర్లు లేదా నిటారుగా ఉన్న ఉపరితలాలపై ఎక్కడానికి కష్టంగా ఉంటాయి. కానీ ఈ పొడవైన పాము అద్భుతంగా ఈత కొట్టగలదు అంతేకాదు సముద్రంలో చాలా దూరం ప్రయాణించగలదని వివేదికలు చెపుతున్నాయి. ఇక..చిన్న చిన్న ద్వీపాలను ఈజీగా చుట్టేస్తుందని సమాచారం. అంతేకాకుండా.. పలువురు రెటిక్యులేటెడ్ పైథాన్‌లచే చంపబడ్డారని కూడా అంటున్నారు. కానీ ఈ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి వణికిపోవడం పక్కా.

ఈ వీడియో ఇదే..


YS Jagan Meets Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్‌ కీలక చర్చలు.. వీటిపైనే ఫోకస్‌..!