Site icon NTV Telugu

Funny Video: ప్లేట్‌ నిండా గులాబ్ జామున్ తీసుకెళ్తున్న మహిళ.. ఫోటో తీయడంతో…

Untitled Design (18)

Untitled Design (18)

రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియో వైరలు అవుతుంటాయి. అయితే ఓ పెళ్లి వేడుకలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో పాల్గొన్న ఓ మహిళ.. విందులో ఏర్పాటు చేసిన గులాబ్ జాములను ప్లేట్ నిండా నింపుకుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఫోటో గ్రాఫర్ పోటో తీయడంతో.. గులాబ్ జామున్ అన్ని తీసేసింది. కేవలం ఒకే ఒక గులాబ్ జామును ప్లేట్ లో పెట్టుకుంది. అయితే దీనికి సంబంధించిన ఫన్నీవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Electric Scooter: మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తున్న EOX ZUKI ఎలక్ట్రిక్ బైక్

పూర్తి వివరాల్లోకి వెళితే.. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు భోజనాల వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరికి వారు తమ భోజనాన్ని ప్లేట్ లో వడ్డించుకుంటున్నారు. అయితో ఓ మహిళ మాత్రం విందులో ఏర్పాటు చేసిన గులాబ్ జామున్లు చూసింది. వెంటనే అక్కడే ఉన్న ప్లేట్ లోకి ఒక 10 గులాబ్ జామ్లు ప్లేట్ వేసుకుని తీసుకెళ్లబోయింది. అయితే అప్పుడే అక్కడికి చేరుకున్న ఫోటో గ్రాఫర్ ఆమె ముందే కెమెరా పెట్టడంతో.. ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. వెంటనే ఆమె సిగ్గుపడి గులాబ్ జామ్ లన్నింటిని తీసేసి.. ఒకే ఒక గులాబ్ జామ్ తీసుకుని తినేసింది. దీంతో ఆ మహిళ చేసిన పనికి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.

Read Also:Smart Tires Launch: స్మార్ట్ టైర్లను లాంచ్ చేసిన JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్

అయితే ఆమె గులాబ్ జామ్ లు ప్లేట్ వడ్డించుకుని మళ్లీ తీసేసే వరకు అన్నింటిని కవర్ చేస్తూ.. ఓ వ్యక్తి వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో తెగ వైరలైంది. వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. గులాబ్ జామ్ కా చోర్ అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు.

Exit mobile version