Site icon NTV Telugu

Monitor Lizard: ఆ బ‌ల్లిని చూసి యువ‌తి కుర్చీ ఎక్కేసింది… చివ‌ర‌కు…

రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ యువ‌తికి చేదు అనుభ‌వం ఎదురైంది. రెస్టారెంట్ లోప‌లికి అడుగుపెట్టిన వెంట‌నే ఆమెకు బల్లిజాతికి ఓ పెద్ద ఉడుము క‌నిపించింది. భ‌య‌ప‌డిన ఆ యువ‌తి వెంట‌నే అక్క‌డే ఉన్న ప్లాస్టిక్ కుర్చి ఎక్కింది. పెద్ద‌గా అర‌వ‌డం మొద‌లుపెట్టింది. ఆమె అరుపుల‌కు భ‌య‌ప‌డిన ఆ ఉడుము ఆ యువ‌తి మీద‌కు దూకే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో మ‌రింత బిగ్గ‌ర‌గా అర‌డం మొద‌లుపెట్టింది. అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి ప‌రిగెత్తుకు వ‌చ్చి దానిని అక్క‌డి నుంచి తొల‌గించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, యువ‌తి అరుపుల‌కు ఉడుము బెదిరిపోయి దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించింది. కాపేండేందుకు వ‌చ్చిన ఆ వ్య‌క్తికి కూడా భ‌యం వేసింది.

Read: Quarantine Rules: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌: క్వారంటైన్‌పై కీల‌క నిర్ణ‌యం…

కామ్‌గా ఉండాల‌ని యువ‌తికి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ లాభం లేక‌పోయింది. చివ‌ర‌కు ఎలాగోలా క‌ష్ట‌ప‌డి ఆ ఉడుమును బ‌య‌ట‌కు పంపించేశారు. ఉడుము వెళ్లిపోవ‌డంతో యువ‌తి మెల్లిగా కుర్చీ దిగింది. ఈ సంఘ‌ట‌న థాయ్‌లాండ్‌లో జ‌రిగింది. థాయ్ ప్ర‌జ‌లు పాములు, బ‌ల్లి జాతికి చెందిన ఉడుముల‌ను ఆహారంగా స్వీక‌రిస్తుంటారు. థాయ్ రెస్టారెంట్‌లో జ‌రిగిన ఈ త‌తంగాన్ని కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.

Exit mobile version