Site icon NTV Telugu

భ‌ర్త‌ను అమ్మ‌కానికి పెట్టిన భార్య‌: షాకైన నెటిజ‌న్లు…

భ‌ర్త అంటే అమెకు అమిత‌మైన ఇష్టం. అయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఆమెను కూడా తీసుకెళ్లాల‌ని కోరుకుంటుంది. కానీ, ఆ భ‌ర్త మాత్రం ఆమెను తీసుకెళ్లేవాడు కాదు. భార్య‌ను చాలా బాగా చూసుకునేవాడు. భార్య అంటే ఎంత ఇష్ట‌మో, చేప‌ల వేట అన్నా అంతే ఇష్టం. చేప‌ల వేటకు త‌న‌ను కూడా తీసుకెళ్లాల‌ని ఆ భార్య కోరుకునేది. కానీ, అందుకు ఆ భ‌ర్త జాన్ ఒప్పుకునేవాడు కాదు. ఒంట‌రిగానే చేప‌ల వేట‌కు వెళ్లేవాడు. ఓసారి భార్య లిండాకు చెప్ప‌కుండా చేప‌ల వేట‌కు వెళ్లాడు. దీంతో ఆ భార్య‌కు కోపం వ‌చ్చింది. వెంట‌నే త‌న భ‌ర్త‌ను అమ్ముతున్న‌ట్టుగా న్యూజిలాండ్‌లోని పాపులర్ సైట్ ట్రేడ్‌మీ లో ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

Read: వైర‌ల్‌: బ్యాట్ తో అద‌ర‌గొట్టిన ముస‌లాయ‌న‌… నెటిజ‌న్లు ఫిదా…

భ‌ర్త ప్రొఫైల్‌ను క్రియోట్ చేసి ఎవ‌రైనా కావాలంటే కొనుక్కొవ‌చ్చ‌ని పేర్కొన్న‌ది. త‌న భ‌ర్త గుణగ‌ణాల‌ను వివ‌రించింది. భ‌ర్త చాలా మంచివాడ‌ని, అందంగా ఉంటాడ‌ని, భ‌ర్త‌కు గృహ‌శిక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్న‌ది. లిండా ఇచ్చిన ప్ర‌క‌ట‌న కింద నో రిట‌ర్న్, నో ఎక్చేంజ్ అనే క్యాప్ష‌న్‌ను జ‌త చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను జాన్ స్నేహితులు గ‌మ‌నించి ఆయ‌న‌కు తెలియ‌జేయ‌డంతో షాక్ తిన్నాడు. వెంట‌నే జాన్ ట్రేడ్‌మీ సైట్ ను సంప్ర‌దించి ఆ యాడ్‌ను తొలగించేలా చ‌ర్య‌లు తీసుకున్నాడు. భార్య చేసిన ప‌నికి జాన్ ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యాడు.

Exit mobile version