Site icon NTV Telugu

అగ్నిప‌ర్వ‌తంపై రెస్టారెంట్‌: అక్క‌డ భోజనం చేయాలంటే…

అగ్ని ప‌ర్వ‌తాలు రెండు ర‌కాలు ఉంటాయి. కొన్ని నాన్ యాక్టీవ్‌గా ఉంటే కొన్ని యాక్టీవ్‌గా ఉంటాయి. యాక్టీవ్‌గా ఉండే అగ్నిప‌ర్వ‌తాలు నిత్యం వేడిని వెద‌జ‌ల్లుతుంటాయి. అవి ఎప్పుడు బ‌ద్ద‌ల‌వుతాయో చెప్ప‌లేం. ఆ ప‌ర్వ‌తాల వ‌ద్దకు వెళ్లాలి అంటే ధైర్యం ఉండాలి. అలాంటిది ఆ ప‌ర్వ‌తంపై రెస్టారెంట్ ఓపెన్ చేసి, అగ్నిప‌ర్వ‌తం నుంచి వెలువ‌డే వేడితోనే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది. క‌ష్ట‌మ‌ర్ల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే అందులో పనిచేసేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి. ఇలాంటి రెస్టారెంట్ ఒక‌టి స్పెయిన్‌లోని టెగ్యూస్‌లో ఉంది. లాంజారోబ్ దీవిలోని అగ్నిప‌ర్వ‌తంపై ఎల్ డ‌యాబ్లో రెస్తారెంట్ ను నిర్మించారు. దీనికి ఎలాంటి పునాదులు వేయ‌లేదు. సున్న‌పురాయిని ఆరు లేయ‌ర్లుగా వేసి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లో ఓ పెద్ద గుంత‌ను ఏర్పాటు చేశారు.

Read: శాస్త్ర‌వేత్త‌ల ఆందోళ‌న‌: రెండు వేల ఏళ్ల‌లో ఏర్ప‌డిన మంచు 25 సంవ‌త్స‌రాల్లోనే…

దానికింద లావా నిత్యం ఉడుకుతుంటుంది. అయితే, ఆ లావా బ‌య‌ట‌కు వెద‌జ‌ల్ల‌దు. అక్క‌డి నుంచి వేడి మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ వేడితో గ్రిల్స్‌పై వివిధ ర‌కాల ఆహార‌ప‌దార్ధాల‌ను వండుతుంటారు. ఈ అగ్నిప‌ర్వ‌తం 1824లో ఒకసారి బ‌ద్ద‌లైంది. అప్ప‌టి నుంచి యాక్టీవ్‌గా ఉన్ప‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌లా బ‌ద్ద‌లు కాలేదు. అగ్నిప‌ర్వ‌తంపై ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ స్పెయిన్‌లో య‌మా ఫేమ‌స్ కావడంతో ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి అనేక‌మంది ప‌ర్యాట‌కులు ఈ ఎల్ డ‌యాబ్లోను సంద‌ర్శిస్తుంటారు.

Exit mobile version