viral video: ఏం పని ఆంటీ ఇది? వైరల్ వీడియో చూశారా!

  • పీక్స్‌కు చేరిన రీల్స్ పిచ్చి
  • ఎస్కలేటర్‌పై మహిళ ప్రమాదకర విన్యాసాలు
Viral Escalator Stunt Video

Viral Escalator Stunt Video

viral video: సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం జనం ఎంతటి సాహసానికైనా వెనకాడటం లేదు. ఒక్కోసారి ఈ పిచ్చి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా ఓ మహిళ చీర కట్టుకుని ఎస్కలేటర్‌పై చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

READ ALSO: South Indian Lemon Rice Recipe: నిమిషాల్లోనే ఘాటైన, టేస్టీ లెమన్ రైస్ రెడీ..

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక రద్దీగా ఉండే మాల్ లేదా మెట్రో స్టేషన్‌లో ఒక మహిళ చీర కట్టుకుని ఎస్కలేటర్ వద్దకు వచ్చింది. సాధారణంగా ఎస్కలేటర్ ఎక్కాల్సింది పోయి, ఆమె ఒక్కసారిగా ఎస్కలేటర్ పక్కన ఉండే రైలింగ్ పైకి ఎక్కింది. అది చూసి అక్కడ ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతటితో ఆగకుండా, ఆమె రైలింగ్ పైనుంచి కదులుతున్న ఎస్కలేటర్‌పైకి ప్రమాదకరంగా దూకింది. అక్కడ కూడా వింత చేష్టలు చేస్తూ, ఎస్కలేటర్ పైకి వెళ్తుంటే ఆమె దానికి వ్యతిరేక దిశలో కిందకు పరిగెత్తడం ప్రారంభించింది. చీర కట్టుకుని ఉండటంతో ఏ మాత్రం పట్టు తప్పినా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉన్నా, ఆమె అవేమీ పట్టించుకోకుండా రీల్ కోసం ఈ ఫీట్లు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియోను ‘@desimojito’ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ.. “ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్లు ప్రభుత్వాన్ని నిందిస్తారు” అనే క్యాప్షన్ ఇచ్చారు. దాదాపు 6 లక్షలకు పైగా వీక్షణలు పొందిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. “ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతాయి. సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకూడదు” అని ఒకరు కామెంట్ చేయగా, “కేవలం కొన్ని లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టడం మూర్ఖత్వం. ఏదైనా తప్పు జరిగితే బాధ్యత ఎవరిది?” అంటూ మరొకరు నెటిజన్ ప్రశ్నించారు. సోషల్ మీడియా క్రేజ్ ఉండొచ్చు కానీ, అది ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉండకూడదు. ఇలాంటి ఘటనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

READ ALSO: Kuldeep Yadav Marriage: పెళ్లికొడుకు అయిన టీమిండియా స్టార్ క్రికెటర్.. భార్య ఆస్తి ఎంతో తెలుసా?