Site icon NTV Telugu

Snake in Woman Ear: మహిళ చెవిలో దూరిన పాము.. వీడియో వైరల్

Snake In Woman Ear

Snake In Woman Ear

Snake in Woman Ear: శరీర భాగాలలో చెవి, కన్ను, ముక్కు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. మాములుగా చెవిలో చీమ దూరినా మనం అల్లాడిపోతాం. అలాంటిది పాము దూరితే ఇంకేమైనా ఉందా.. అంతే సంగతులు. అయితే ఓ మహిళ చెవిలోకి పసుపు రంగులో ఉన్న చిన్న పాము దూరిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాము చెవిలో దూరడమేంటని నోరెళ్లబెడుతున్నారు. అయితే మహిళ చెవి నుంచి పామును బయటకు తీసేందుకు ఓ డాక్టర్ తెగ ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చేతులకు గ్లౌజ్‌లు వేసుకున్న డాక్టర్‌ ఫోర్‌సెప్స్‌తో నోరు తెరిచిన పామును మహిళ చెవి నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది.

Read Also:Indian Railways: రైల్వే ప్రయాణికులకు ఉచితంగా భోజనం.. షరతులు వర్తిస్తాయి

అయితే ఈ వీడియో క్లిప్‌ అసంపూర్తిగా ముగిసింది. దీంతో మహిళ చెవిలో దూరిన చిన్న పామును డాక్టర్‌ బయటకు తీశాడా లేదా అన్న విషయం సస్పెన్స్‌గా మారింది. దీంతో కొందరు నెటిజన్‌లు ఇది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు. వ్యూస్ కోసం చేసిన ట్రిక్ ఇది అంటూ ఆరోపిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 87వేలకు పైగా వ్యూస్​ వచ్చాయి. 100కుపైగా లైక్స్​ లభించాయి. మరోవైపు ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి క్లిప్​ని పోస్ట్​ చేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు.

Exit mobile version