NTV Telugu Site icon

Viral Video: జేబులో ఫోన్ కొట్టేస్తే వీడియో చూసే దాకా తెలియలేదు.. జాగ్రత్త బాసూ!

Viral Video News

Viral Video News

Viral Video of phone theft at Kanpur goes viral: అది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అనే పట్టణం. అక్కడ ఒక బిజీగా ఉన్న స్వీట్ షాప్ లో స్వీట్లు కొనేందుకు ఒక వ్యక్తి వ్యక్తి వెళ్లాడు. అయితే బిల్లు కట్టే సమయంలో..మరో వ్యక్తి అతని వద్దకు వచ్చి పక్కనే నిలబడ్డాడు. బిల్లు కడుతున్న క్రమంలో చేతిలో డబ్బులు పట్టుకొని చూస్తున్న వ్యక్తి జేబులోని నుంచి పక్కనే నిల్చుని ఉన్న మరో వ్యక్తి జేబులోంచి చాకచక్యంగా ఫోన్ కొట్టేశాడు. అసలు ఆ ఫోన్ తన జేబులోంచి తీసినట్లు కూడా సదరు వ్యక్తి గుర్తించలేక పోయాడు, అంటే ఎంత ఈజీగా ఫోన్ కొట్టేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా సేపటి తర్వాత తన ఫోన్ కనిపించడం లేదని గుర్తించి అప్పుడు సీసీ కెమెరాలు పరిశీలించగా… అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Baby Collections: బేబీ మూవీ అనూహ్యమైన రికార్డు

కస్టమర్ మొబైల్‌ని దొంగతనం చేస్తున్న అంశం సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇక కాన్పూర్ జిల్లాలో ఈ దొంగల ముఠా మళ్లీ యాక్టివ్‌గా మారిందని అంటున్నారు. అందుతున్న సమచారం మేరకు ఈ వ్యక్తి కల్నల్‌గంజ్ ముఠాకు చెందినవాడని, ఈ ముఠా ఫోన్లు దొంగతనాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుందని అంటున్నారు. అందుకే రద్దీగా ఉన్న ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతుంటారు. కొందరు దొంగతనం చేసేందుకే రద్దీ ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటారు, కాబట్టి ఈసారి మీరు రద్దీ ప్రదేశాలకు వెళితే జాగ్రత్తగా ఉండండి. నిజానికి ఈరోజుల్లో అన్ని విషయాలు ఫోన్ తోనే ముడిపడి ఉంటున్నాయి. బ్యాంకు ఖాతాలు మొదలు అన్నే ఫోన్లతోనే లింక్ అయి ఉండడంతో ఫోన్ పోయిన వెంటనే మన సిమ్ తో లింక్ అయి ఉన్న అన్ని ఖాతాలను నిలిపివేయాల్సి ఉంటుంది.

Show comments