NTV Telugu Site icon

Viral Video: చంద్రుడిపై జారిపడ్డ వ్యోమగామి.. మైకేల్ జాక్సన్‌లా మూన్‌వాక్ అంటూ..

Astrounaut

Astrounaut

చంద్రుడితో మానవాళికి ఉన్న అనుబంధ ఎంతో.. చిన్న పిల్లలకు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ.. చందమామ రావే అంటూ పాడటం.. ఇలా చెప్పుకుంటే పోతే.. ప్రతి ఒక్కరి జీవితంలో చందమామతో ప్రత్యేక అనుబంధం ఉండేఉంటుంది. అయితే అలాంటి అలంత దూరంలో ఉన్న చందమామపైకి రాకెట్లను పంపి పరిశోధనలు చేస్తున్నాం. చందమామపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించాం. అయితే చంద్రుడుపై ఏముంది అనే మిలియన్‌ డాలర్ల ప్రశ్నను ఛేదించేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 

అయితే.. ఇప్పుడు నెట్టింట్లో ఓ వ్యోమగామి చంద్రుడుపై న‌డుస్తూ కాలుజారి ప‌డ్డ వీడియోను నాసా విడుద‌ల ఇటీవ‌ల చేయ‌గా, చ‌క్క‌ర్లు కొడుతోంది. చంద్రుడిపై వాతావ‌ర‌ణ అన్వేష‌ణ‌కు వ్యోమ‌గాములు 1972లో అపోలో 17 మిష‌న్‌లో అడుగుపెట్టారు. వారు చంద్రుడిపై న‌డిచారు. ఈ క్ర‌మంలో ఓ వ్యోమ‌గామి కాలుజార‌డంతో కింద‌ప‌డిపోయాడు. నాసా విడుద‌ల చేసిన ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్ప‌టికే 5 ల‌క్ష‌ల‌మంది వీక్షించారు. మైకేల్ జాక్సన్‌లా మూన్‌వాక్ ఎలా చేయాలో తెలియ‌కుంటే ఇలా జ‌రుగుతుంద‌ని ఒక‌రు స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు.