NTV Telugu Site icon

Video Viral: ఇంత క్యూట్ గా మారిపోయారేంటి ప్రపంచ నేతలు.. ఏఐ రూపొందించిన వీడియో..

5

5

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్ రష్మిక మందన సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగ., తాజాగా హీరో రణ్ వీర్ కపూర్ సంబంధించిన వీడియో కూడా డిప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి చేశారు. దాంతో వారు అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. అయితే ఈ టెక్నాలజీని ఎవరైనా మంచి పనులకు ఉపయోగిస్తే బాగుంటుంది. కాకపోతే., ఇలా అనవసరమైన చర్యలకు వాడుకుంటే వాటి వల్ల ఇతరులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Also Read: Crystal Salt : కళ్లు ఉప్పు వాడుతున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

ఇకపోతే తాజాగా ఈ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ప్రపంచ నాయకుల చిన్ననాటి ఫోటోలను తయారు చేశారు. అలా ఫోటోలను తయారు చేసిన తర్వాత వాటితో కలిసి ఓ వీడియోని రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు, దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, అలాగే బ్రెజిల్ దేశ అధ్యక్షులు ఫోటోలను చిన్న పిల్లాడిగా మార్చేశారు.

Also Read: Beauty: మారుతి చేతుల మీదుగా ప్రారంభమైన ‘బ్యూటీ’

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు వారి దేశాధినేత సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిన్నప్పటి ఫోటో ఎలా ఉందో ఓ లుక్ వేయండి.

Show comments