Site icon NTV Telugu

Video Viral: బికినీ ధరించి బస్సులోకి ప్రవేశించిన మహిళ.. చివరకు..

14

14

ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో బికినీ ధరించిన ఓ మహిళ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోకు సోషల్ మీడియా వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. 12 సెకండ్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీడియో చూసిన నటిజెన్స్ కాస్త కోపంగా స్పందిస్తున్నారు. సభ్య సమాజం ఎలా పైన పర్లేదు నాకేంటి అని, నేను ఇంతే అంటూ కొందరు అసభ్యకర పనులు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.

Also read: Shaykh Ismail : 40 ఏళ్లుగా హజ్ యాత్రికులకు ఉచితంగా టీ, కాఫీలు అందిస్తున్న ఇస్మాయిల్ కన్నుమూత

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పేరుగాంచిన కొంతమంది అమ్మాయిలు ఈ మధ్యకాలంలో వారు చేసే రచ్చ మరింతగా జరిగింది. ఇలాంటి చర్యలలో భాగంగానే తాజాగా ఢిల్లీలో ఓ పబ్లిక్ బస్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తన లోదుస్తులు మాత్రమే వేసుకొని రద్దీగా ఉండే ఓ పబ్లిక్ బస్సులో ప్రయాణం చేసింది. అయితే ఆ సమయంలో బస్సులో ఉన్న పురుషులు, పిల్లలు, మహిళలు అని తేడా లేకుండా అందరూ సమానంగా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. మరికొందరైతే ఆమెను చూసి బస్సు నుంచి దిగిపోవడం కూడా జరిగింది.

Also read: PBKS vs MI: పంజాబ్‌తో ముంబై ఢీ.. రోహిత్‌ శర్మకు స్పెషల్ మ్యాచ్!

ఈ పరిస్థితుల్లో బస్సు కండక్టర్ కూడా ఆమెని చూసి ఏమీ చేయలేని పరిస్థితి చేరుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో మహిళ ప్రవర్తన పూర్తిగా అసభ్యకరంగా ఉండడంతో వీడియో చూసిన నెటిజెన్స్ మండిపడుతున్నారు. మొదట అటువంటివారిని బస్సులోంచి బయటికి తోసేయాలంటే ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

Exit mobile version