Site icon NTV Telugu

Bihar: బైక్‌పై యువకుడు డేంజర్స్ స్టంట్స్.. నెటిజన్ల ఆగ్రహం

Biharbiker

Biharbiker

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. గుర్తింపు కోసమో.. లేదంటే ఇంకేదైనా గొప్ప కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బీహార్‌లో ఓ యువకుడు చేసిన స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం..

నమస్తే ఇండియా పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒక యువకుడు బైక్‌పై డేంజర్స్ స్టంట్లు చేస్తూ కనిపించాడు. బైక్‌పై నిలబడి.. చేతులు ఊపుతూ వేగంగా దూసుకుపోయాడు. వెనక నుంచి మరొక మొబైల్‌లో చిత్రీకరించారు. అంతేకాకుండా ఒక హైవేపై పుష్-అప్స్ కనిపించాడు. ఇలా ప్రతిరోజూ స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. అయితే గ్రామంలో ఇలా ప్రమాదకరంగా విన్యాసాలు చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే తాజాగా ఈ వీడియోలు పోలీసుల కంటపడ్డాయి. ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేస్తే ప్రాణాలకే ముప్పువాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బైక్ నెంబర్ ఆధారంగా యువకుడిని పట్టుకుని కౌన్సెలింగ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Janasena: పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి రోశయ్య

ఇదిలా ఉంటే ఈ వీడియోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. దయచేసి పౌరులకు రక్షణకు కల్పించాలని కోరుతున్నారు. అతడి స్టంట్లు వల్ల ఇతరులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సమస్తిపూర్ పోలీసులకు నెటిజన్లు ట్యాగ్ చేసి చర్య తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితమే హసన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమస్తిపూర్‌ పోలీసులు ధృవీకరించారు.

Exit mobile version