NTV Telugu Site icon

Viral Video: చేతులు లేకపోతేనేం.. కాళ్లతో ఫుట్‌బాల్ ఇరగదీస్తున్నాడు.. వీడియో వైరల్

Viral Video

Viral Video

సోషల్ మీడియాలో ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్లు పుట్టుకొచ్చారు. వారు చెప్పే రొటీన్ ప్రసంగాలు ఎవ్వరికీ మేలు చేయలేవు. కానీ అలాంటి వీడియోలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిని నుంచి ప్రేరణ పొందే వాళ్లు తక్కువగానే ఉన్నా.. వారికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఓ దివ్యాంగుడి మోటీవేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆ దివ్యాంగుడు మాటలు చేప్పలేదు. తన ప్రతిభను చేతల్లో చూయించాడు. ఈవీడియో వీక్షకులను ఉత్తేజపరుస్తుంది.

READ MORE: Bhopal: ధూమ్ 2 సినిమా తరహాలో చోరీకి ప్లాన్.. బెడిసికొట్టి చివరికిలా..!

వీడియోలో ఏముందంటే?

వీడియోలో.. తన రెండు చేతులు కోల్పోయిన వ్యక్తి పూర్తిగా శిక్షణ పొందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడిలా తన పాదాలతో ఫుట్‌బాల్ మాయాజాలం చూపిస్తున్నాడు. వాస్తవానికి.. వికాస్ మోహతా అనే వినియోగదారు ఈ వీడియోను మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ లో పోస్ట్ చేసారు. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే’ అని వీడియో క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియోలో కొండపాక, గ్రామీణ ప్రాంతంలోని ఓ ప్లేగ్రౌండ్‌లో రెండు చేతులు లేని వ్యక్తి తనకు కావాల్సిన రీతిలో ఫుట్‌బాల్ ఆడిస్తున్నట్లు చూడవచ్చు. ఇది చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెండు చేతులు లేకపోయిన కాళ్లతో అద్భుతమైన విన్యాసాలు సృష్టిస్తున్నాడు. తన బ్యాలెన్స్ ను చక్కగా అదుపుచేస్తున్నాడు. అక్కడ ఉన్న చాలా మంది అతని ప్రతిభకు చప్పట్లు కొట్టకుండా ఉండలేక పోయారు.

READ MORE:Vijayawada Floods: వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు..

ఈ దివ్యాంగుడు హాఫ్ ప్యాంట్, హాఫ్ షర్ట్ ధరించాడు. ఎటువంటి సహాయం లేకుండా ఫుట్‌బాల్ తన పాదాల నుంచి కిందకి పడనివ్వడం లేదు. ధైర్యం, అభ్యాసానికి ఈ అద్భుతమైన ఉదాహరణను చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు ప్రేరణ పొందుతున్నారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే, వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు. లైక్ చేసారు-రీపోస్ట్ చేసారు. వీడియోపై కామెంట్స్‌లో వందలాది మంది ఈ వ్యక్తిని ప్రశంసించారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను చాలా స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు.

Show comments