VandeBharat Train Speed: వందే భారత్ రైలు ఘనత.. గంటకు 180 కి.మీ వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వేలు మరో ఘనతను సాధించాయి. వందే భారత్ పేరుతో సూపర్ ఫాస్ట్ ట్రైన్ సరికొత్త రికార్డు సృష్టించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కొత్త మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ చేసి వివరాలను వెల్లడించారు. ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో తాజాగా ట్రైల్ రన్ రైల్వే శాఖ నిర్వహించింది. కోటా నుంచి మహిద్‌పూర్ రోడ్ స్టేషన్‌వరకు 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ దూసుకెళ్లింది. టెస్ట్ సమయంలోనే రైలులో వాషింగ్, క్లీనింగ్‌తో పాటు అన్ని పరికరాల పనితీరును పరిశీలించినట్టు రైల్వే మంత్రి తెలిపారు.

Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
ఈ రైలును మొత్తం 16 కోచ్‌లతో ట్రైల్ నిర్వహించినట్టు వివరించారు. మంత్రి చేసిన ట్వీట్లో రైలు వేగాన్ని పరీక్షించే స్పీడో మీటరు పక్కనే గ్లాసు నిండా నీరున్నా ఒలకని వీడియోని మంత్రి ట్వీట్లో జతచేశారు. రైలు ఎంత స్పీడ్ వెళ్లినా నాణ్యత, భద్రతతో కూడిన ప్రయాణం అనుభూతి చెందవచ్చని రైల్వేమంత్రి తెలిపారు. సూపర్ రైడ్ క్వాలిటీ అంటూ మంత్రి కితాబిచ్చారు. వందే భారత్ రైళ్ల వేగంలో ధీటైనవి. వేగానికి తగ్గట్టుగా పటిష్టంగా వుండేలా ఈ రైళ్లను చాలా ప్రత్యేకంగా నిర్మించారు. ట్రయల్ కూడా హై లెవెల్లో పరీక్షిస్తున్నారు. ట్రైన్ స్పీడ్ ట్రయల్ తొలిదశలో 110 కిలోమీటర్లకు చేరుకుని అనంతరం రెండవ దశ ట్రయల్ రన్ లో గరిష్ట వేగం 180 కిలోమీటర్లకు చేరుకుంది.
Superior ride quality.
Look at the glass. Stable at 180 kmph speed.#VandeBharat-2 pic.twitter.com/uYdHhCrDpy— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!