Policeman steals LED bulb: ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్‌పూర్ ప్రాంతం నుండి ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్ధరాత్రి పాన్ షాప్ నుండి లైట్ బల్బును దొంగిలిస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చోరీ అక్టోబర్ 7న జరిగినట్లు సీసీటీవీలో రికార్డయింది.
ఈ వీడియో వైరల్ కావడంతో ఫుల్‌పూర్ కొత్వాలిలో ఇన్‌స్పెక్టర్ రాజేష్ వర్మను ఎస్‌ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ వీడియోలో మూసి ఉన్న పాన్ షాప్‌ను సమీపించి, చుట్టుపక్కల ఒక లుక్ వేస్తూ కనిపించాడు ఇన్‌స్పెక్టర్. చాకచక్యంగా ఆ తర్వాత షాప్ బయట ఉన్న ఎల్‌ఈడీ బల్బును వేగంగా తీసి జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు. దసరా మేళా రాత్రి, పోలీసు నైట్ డ్యూటీలో ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం బల్బు కనిపించకుండా పోవడంతో దుకాణదారుడు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగ ఇన్‌స్పెక్టర్ అని తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు.
Uttar Pradesh: Policeman steals LED bulb, caught on CCTV camera #UttarPradesh #LED #WATCH #UPPolice #ViralVideo #वायरल #Prayagraj #cctv pic.twitter.com/WEtp86Lbt2
— Harish Deshmukh (@DeshmukhHarish9) October 15, 2022
