ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా దళాలు ఇప్పటికే ప్రవేశించాయి. రెండు దేశాల సైనికుల మధ్య యుద్ధం బీకరస్థాయిలో జరుగుతున్నది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఈ దాడులకు భయపడి సామాన్యప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బంకర్లలో తల దాచుకుంటున్నారు. ఇలాంటి ఉక్రెయిన్ మరుభూమిగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఎవరికి పెళ్లి అనే ఆలోచన రాదు. పెళ్లి కంటే బతికి ఉండటమే మేలు అనుకుంటారు.
Read: Ukraine – Russia War: రంగంలోకి సోషల్ మీడియా… రష్యాపై ఆంక్షలు…
అయితే, కీవ్ కు చెందిన యారినా అరివా, స్వ్యటోస్లావ్ ఫర్సిన్ జంట యుద్ధం జరుగుతున్న సమయంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. కీవ్ నగరంలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. బయట బాంబుల మోత, తుపాకి తూటాల చప్పుళ్లకు భయపడకుండా వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత తాము బతికి ఉంటామో లేదో చెప్పలేమని, వివాహం తరువాత తుపాకీ చేతపట్టి తమ దేశం తరపున కదనరంగంలోకి దిగుతామని యారినా అరివా తెలిపారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
