Site icon NTV Telugu

Viral Video: ఇవి కూడా దొంగతనం చేస్తారా!.. ఈ అమ్మాయిలు చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్లు

Women Steal Flower Pots

Women Steal Flower Pots

పంజాబ్‌లో వింత సంఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి ఓ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదేం సరదా.. ఇలాంటి దొంగతనం కూడా చేయొచ్చా అంటూ షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. పంజాబ్‌లోని మొహాలిలో వింత చోరి జరిగింది. డబ్బు, ఆభరణాలు, బైక్స్‌, కార్లు దొంగతనం చేయడం సాధారణ విషయమే. కానీ ఈ వీడియోలోని అమ్మాయిలు అనుకొని విధంగా వ్యవహరించారు. అర్థరాత్రి కారులో వచ్చి ఓ ఇంటి ముందు ఆగారు. గబగబ కారు దిగి ఆ ఇంటి గేటు ముందుకు వచ్చారు.

Also Read: Mahesh Babu: కృష్ణ వర్థంతి.. తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్

చూట్టూ చూసి అక్కడ ఉన్న పూల కుండిలను పట్టుకుని పరుగు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వారు అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. చూస్తుంటే వారు ఆ పూల కుండిల కోసమే అక్కడికి వచ్చిట్టు అనిపిస్తోంది. ఆ అమ్మాయిలు సెడాన్ కారులో వచ్చి.. పూల కుండిలను దొంగిలించడం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ‘పూల కుండిలను కూడా దొంగతనం చేస్తారా!’, ‘అరెరె.. సీసీ కెమెరా ఉంది.. చూసుకోవాలి కదా అమ్మాయిలు’ అంటూ ఫన్నీగా రెస్పాండ్‌ అవుతున్నారు.

Also Read: Sudheer Babu: సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి.. సుధీర్‌ బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

Exit mobile version