ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణికులు రెచ్చిపోయారు. టికెట్ చూపించమన్న పాపానికి ఏకంగా టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై భౌతికదాడికి పాల్పడ్డారు. ముగ్గురు ప్రయాణికులు టీసీపై దాడి చేశారు. ట్రైన్ కోచ్‌లోని రైలింగ్‌కు నొక్కి ఇష్టానురీతిగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చూసి సుకుమార్ ఫోన్.. మోసం చేశావన్నారు: దర్శకుడు లక్ష్మణ్ కార్య ఇంటర్వ్యూ
ముంబైలోని చర్చ్‌గేట్ నుంచి విరార్‌కు వెళ్లే ఏసీ లోకల్ రైలులో చెల్లని టిక్కెట్లతో ముగ్గురు ప్రయాణికులు రైలు ఎక్కారు. ప్రయాణీకులను తమ టిక్కెట్లు చూపించమని చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ జస్బీర్ సింగ్ అడిగాడు. అయితే చెల్లని పత్రాలు చూపించడంతో ఫైన్ కట్టాలని అడిగాడు. బోరివాలి స్టేషన్‌లో ఉన్న తదుపరి స్టేషన్‌లో రైలు దిగాలని అధికారి వారిని కోరాడు. కానీ అందులో ఒక ప్రయాణికుడు భోసాలే సింగ్ నిరాకరించాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలోనే ఒక్కసారిగా టీసీపై ముగ్గురు ప్రయాణికులు దాడి చేశారు. పీకనొక్కి… కాళ్లు, చేతులు విరిచేశారు. ఈ తతాంగాన్ని ట్రైన్‌లో మరో ప్రయాణికుడు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. ఈ ఘటనలో టీసీకి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు రైలు ఎక్కి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. టీసీ జస్బీర్ సింగ్‌రు క్షమాపణలు చెప్పించి.. జరిమానా కట్టించారు.
