కవితకు కాదేది అనర్హం అని శ్రీశ్రీగారు చెప్పినట్టుగా దోచుకోవడానికి దొంగలకు కాదేది అనర్హం అంటున్నారు బీహార్ దొంగలు. బీహార్‌లోని డెహ్రీ పట్టణంలో చారిత్రాత్మకమైన సూర్య గడియారాన్ని దొంగలు దోచుకుపోయారు. 1871లో బ్రిటీష్ పరిపాలన కాలంలో డెహ్రీ పట్టణంలో ఈ గడియారాన్ని ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన ఈ గడియారం ఉన్న ప్రాంతం చుట్టూ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఆఫీసులు ఉన్నాయి. నిత్యం ప్రజలు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారు. అంతేకాదు, జిల్లా జెడ్జి, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, సబ్ డివిజినల్ మ్యాజిస్ట్రేట్ నివాసాలు ఉన్నాయి.
Read: UttarPradesh: యోగి దుస్తుల్లో పోలింగ్‌బూత్ కు వచ్చిన కోహ్లీ… సెల్పీలు దిగుతూ…
నిత్యం పోలీసుల పహారాతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇంతటి భద్రత ఉన్నప్పటికీ చారిత్రాత్మకమైన గడియారాన్ని పగలకొట్టి అందులోని కీలకమైన పరికరాలను ఎత్తుకుపోయారు. భద్రత ఉన్నప్రాంతంలోనే దొంగలు చేతివాటం చూపడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
