NTV Telugu Site icon

Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?

Expensive Tea

Expensive Tea

ఒక కప్పు టీకి రూ. లక్ష ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవును.. మీరు నమ్మకపోయినా.. ఇది నిజం. దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్ మెనూలో లక్ష రూపాయల టీ కనిపిస్తుంది. ఈ ‘గోల్డ్ కడక్’ టీ ధర ఆకాశాన్నంటుతోంది. దుబాయ్‌లో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త సుచేతా శర్మ రెస్టారెంట్‌లో ఈ ఖరీదైన చాయ్‌ని అమ్ముతున్నారు. ఈ బోహో కేఫ్ లో టీ ధర AED 5000 (సుమారు రూ. 1.14 లక్షలు). 24 క్యారెట్ల బంగారు పూత కలిపిన ఈ టీని స్వచ్ఛమైన వెండి కప్పులో అందిస్తారు. ఒక్కో సిప్ లో వేడివేడి చాయ్ తో పాటు బంగారాన్ని కూడా తాగేయొచ్చు. టీ తాగాక కప్పును అక్కడే వదిలేయకుండా ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చట.

READ MORE: Magical Stumping: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ఘటన.. మీరే చూసేయండి (వీడియో)

ఈ రెస్టారెంట్ బోహో కేఫ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ లో ఉంది. ఇక్కడ మెనులో భారతీయ ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ప్రీమియం ఐటెమ్‌లలో గోల్డ్ సావనీర్ కాఫీ, గోల్డ్ డస్టెడ్ క్రోసెంట్స్, గోల్డ్ డ్రింక్స్, గోల్డ్ ఐస్ క్రీం కూడా ఉన్నాయి. ఈ ఖరీదైన పదార్థాల గురించి సుచేతా శర్మ మాట్లాడుతూ.. “మేము లగ్జరీని కోరుకునే వ్యక్తుల కోసం ఇలాంటి వాటిని తయారు చేస్తున్నాం. అంతే కాకుండా మేము గోల్డ్ సావనీర్ కాఫీ కూడా సర్వ్ చేస్తున్నాం. ఇది కూడా వెండి పాత్రలో అందిస్తాం. దీని ధర AED 4761 (సుమారు రూ. 1.09 లక్షలు). ఈ కప్‌లు కూడా మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ” అని పేర్కొన్నారు.

READ MORE:TG Assembly: లగచర్ల రైతులకు బేడీల విషయంలో బీఆర్‌ఎస్ నిరసన.. అసెంబ్లీ రేపటికి వాయిదా

అయితే ఒక ఫుడ్ వ్లాగర్ బోహో కేఫ్ గురించిన వీడియోను అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రెస్టారెంట్‌లో ఏయే విషయాలు బాగా ఫేమస్‌, వాటి కోసం ఎంత ధర చెల్లించాల్సి వస్తుందో వివరించింది. అలాగే.. కేఫ్‌లో టీ, కాఫీ అందించే విధానం ఎంత ప్రత్యేకమైనదో ప్రస్తావించింది. అయితే.. దీనిపై ప్రజలు రకరకాలుగా స్పందించారు. ఈ టీతో ప్రయోజనం ఏమిటంటూ చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. సామాన్యుడికి అత్యంత చేరువైనది టీ.. దానికి రూ.లక్షకు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. “గోల్డ్ కడక్ టీ తాగాలంటే ఈఎంఐ కట్టాల్సిందే” అని ఓ వ్యక్తి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

Show comments