NTV Telugu Site icon

Mars: మార్స్ పై వింత వ‌స్తువు…

గ‌త సంవ‌త్స‌రం కాలంగా ఆరుణ గ్ర‌హంపై రోవ‌ర్ పెర్సెవెరెన్స్ ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న‌ది. అరుణ‌గ్ర‌హంపై ఉన్న మ‌ట్టిని, రాళ్ల‌ను సేక‌రించి దానిని ప్ర‌త్యేక‌మైన ట్యూబుల‌లో నిల్వ చేస్తున్న‌ది. ప‌రిశోధ‌న అంశాల‌ను భూమిమీకు పంపుతున్న‌ది మార్స్ రోవ‌ర్‌. అయితే, ఈ క్యూరియాసిటీ రోవ‌ర్ ఫిబ్ర‌వ‌రి 13, 2022న మార్స్ పై ఓ వింత వ‌స్తువును క‌నిపెట్టింది. చూసేందుకు ఆ వ‌స్తుత‌వు పాత‌కాల‌పు పాత్ర మాదిరిగా ఉండ‌టంతో ఆస‌క్తి నెల‌కొన్న‌ది. క్యూరియాసిటీ రోవ‌ర్ ఆ వ‌స్తువు ఏంటి అనే దానిపై ప్ర‌స్తుతం నాసా శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. అది నిజంగానే ఏదైనా వ‌స్తువా లేకుండా అక్క‌డి శిల‌లు ఆవిధంగా ఏర్ప‌డ్డాయా అన్న‌ది తెలియాల్సి ఉంది. అయితే, క్యూరియాసిటీ రోవ‌ర్ పంపిన ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.

Read: Viral: పెళ్లి రిసెప్ష‌న్‌లో ముష్టియుద్ధం…