#TelanganaNotForSale: మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన వెలుగు చూసిన తరువాత సోషల్ మీడియా హోరెత్తిపోయింది. తెలంగాణలో ఈ వ్యవహరం బయటకు రావడంతో.. ప్రజలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. సోషల్ మీడియాలో దీని సంబంధించిన వార్త హాట్ టాపిక్. ట్విట్టర్ లో #TelanganaNotForSale అనే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ కుట్రను బయటపెట్టడంతో.. తెలంగాణ హీరోలంటూ కీర్తించారు నెటిజన్లు.. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి.. ఒక్కసారిగా తెలంగాణ హీరోలయ్యారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అమ్ముడు పోయేవారు కాదంటూ కామెంట్లు కురుపిస్తున్నారు.
Read also: Bharat Jodo Yatra: భారత్ జూడో యాత్రలో టీ.కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, టీఆర్‌ఎస్ పై ఫైర్
బీజేపీ కుతంత్రాలను సాక్ష్యాధారలతో సహా నిరూపించింది ఎమ్మెల్యేలే దీంతో సోషల్ మీడియా వారిని బ్రహ్మరథం పడుతోంది. పొరపాటు దొరకిపోతే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనుమానం వచ్చేలా సీన్ క్రియేట్ చేయాలని బీజేపీ చూసినా.. దానికి ముందే టీఆర్‌ఎస్ నేతలు ముందుగానే పోలీసులకు పార్టీ అధినేతలకు తెలియడంతో బీజేపీ భాగోతం బయటపడింది. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి, ఇతర రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలు అమ్మడవుతారేమో కానీ.. తెలంగాణలో మాత్రం అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ నాట్ ఫర్ సేల్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ ఇలాంటి కొనుగోళ్లకు వ్యతిరేకమని.. బీజేపీ చర్యలను సహించేది లేదని నెటిజన్లు కామెంట్ల రూపంలో హెచ్చరింస్తున్నారు. బీజేపీ సిద్దాంతాలను గాలికి వదిలేసిందని ప్రజాప్రతినిధులను అంగట్లో సరుకులా కొనుగోలు చేయడం సిగ్గుచేటని కమెంట్లు చేస్తున్నారు. అమిత్ షా లావాదేవీ తెలంగాణలో ఫెల్ అంటూ ట్వట్టర్లో కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Amit Shah’s failed attempt in #Telangana,
Caught red handed bribing MLAs to switch party! 👇 #TelanganaNotForSale pic.twitter.com/fxS60dktDG
— YSR (@ysathishreddy) October 26, 2022
