Site icon NTV Telugu

Tamilnadu: కుక్కకు గుడి కట్టిన రైతు.. గుడి కోసం ఎంత ఖర్చు చేశాడంటే..?

Dog Statue

Dog Statue

పెంపుడు జంతువుల్లో కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. అందుకే చాలా మంది కుక్కలను ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఇటీవల కుక్కలు చనిపోయినా తట్టుకోలేని వాళ్లు వాటి మీద ప్రేమతో అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ రైతు కుక్క కోసం గుడి కట్టేశాడు. ఇప్పటివరకు తమిళనాడులో హీరోయిన్‌లకు గుడి కట్టిన వాళ్ల గురించే విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు కుక్క కోసం గుడి కట్టడం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది కదూ.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని శివగంగ జిల్లా మనమధురైకు చెందిన ముత్తు అనే రైతు కుక్కకు గుడికట్టాడు. తాను ఇష్టంగా పెంచుకున్న టామ్ అనే కుక్క గత ఏడాది మరణించింది. దీంతో టామ్ గుర్తుగా ముత్తు తన వ్యవసాయ క్షేత్రంలో రూ.80వేలు ఖర్చు చేసి కుక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు ముఖ్యమైన పండగలు, ప్రతి శుక్రవారం నాడు కూడా క్రమం తప్పకుండా కుక్క విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నాడు. 2010లో టామ్‌ను తెచ్చుకుని కుటుంబ సభ్యుడిగా చూసుకున్నానని.. అది లేకుండా ఏ పని చేసేవాడిని కాదని ముత్తు చెబుతున్నాడు. 2021లో టామ్ చనిపోవడంతో దాని గుర్తుగా గుడిని కట్టించానని వివరించాడు.

Exit mobile version