NTV Telugu Site icon

Pregnancy: ప్రెగ్నెన్సీ రాకుండా కొత్త సాధనం.. తెలుగు రాష్ట్రాల్లో అమలు..?

Without Pregnancy

Without Pregnancy

Without pregnancy: ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు యువతులు కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. వాటిలో ఒకటి గర్భనిరోధక మాత్రలు. ఈ మాత్రలు వేస్కోవడం వల్ల సైడ్ ఎఫెక్స్ట్ వస్తాయని చాలా మంది భావిస్తారు. అందుకే ఎక్కువగా కండోమ్స్ వాడుతుంటారు. కానీ వీటి వల్ల గర్భం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కాపర్-టి వల్ల కూడా నొప్పి ఉంటుందని వాటికి దూరంగా ఉంటారు. ఇలాంటి వాటికంటే మరింత బాగుండి.. ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్స లేకుండా గర్భనిరోధక పద్ధతుల్లో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. వీటి సాధనాల స్థానంలో కొత్త పద్ధతి వస్తోంది. దీనిని తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే.. ఈ సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే దీనిని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పిలుస్తున్నారు.

Read also: Congress leaders: కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్.. కారణం ఇదీ…

ఆసుపత్రిలోని స్టాఫ్ నర్సులు కూడా దీనిని సులభంగా అమర్చేలా శిక్షణ ఇస్తారు. దీని వల్ల ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. అంతేకాకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా దీనిని తొలగించుకోవచ్చు. అయితే.. దీనిని తొలగించిన 48 గంటల తర్వాత గర్భం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కుడిచేతి వాటం ఉన్న వారికి ఎడమవైపు ఎడమచేతి వాటం ఉన్న వారికి కుడివైపున దీనిని అమరుస్తారు. కెన్యాలో ఈ విధానం దాదాపు 20 నుంచి 25 ఏళ్లుగా ఈ విధానం ఉంది. అయితే.. కొన్ని దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అయితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా తమిళనాడు, కర్ణాటక, అస్సాం, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బిహార్, దిల్లా రాష్ట్రాల్లో అమల్లోకి తేవడంపై సమాలోచనలు చేస్తోంది. కాగా..ఈ విధానంలో మూడేళ్ల వరకు గర్భం రాకుండా భద్రత లభిస్తుంది. అంతేకాకుండా.. ప్రసవం జరిగిన వెంటనే లేదా పాలిచ్చే తల్లులకూ ఈ సాధనాన్ని వాడకోవచ్చని తెలిపింది.

సూదిలా ఉంటుంది..

అయితే.. ఈ కొత్త సాధనం 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల పొడవుతో సూదిలా ఉంటుంది. ఈ సాధనం మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. ఇక.. దీంట్లో నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. కాగా.. నిజానికీ సాధనం హార్మోన్‌తోనే తయారై సంతానం మధ్య దూరం ఉండాలని కోరుకునే వారు ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే.. దీనివల్ల భార్యాభర్తల సఖ్యతకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
TS SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఆ పేపర్‌ రాసేందుకు కేవలం 15 నిమిషాలే..

Show comments