NTV Telugu Site icon

పాము… ముంగీస ఫైట్‌…సోష‌ల్ మీడియాలో హైలెట్‌…

పాము..ముంగీస బ‌ద్ద శ‌తృవులు.  పాము క‌నిపిస్తే ముంగీస దాన్ని చంపే వ‌ర‌కు ముంగీస ఊరుకోదు.  రెండు ఒక‌దానికొక‌టి ఎదురుప‌డితే పెద్ద యుద్ద‌మే జ‌రుగుతుంది.  పాము ముంగీస ఫైట్ ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది.  మ‌హారాష్ట్ర జిల్లాలోని బుల్దాన్ జిల్లాలో రోడ్డుమీద పాము, ముంగీస‌లు ఎదురుప‌డ్డాయి.  నువ్వానేనా అన్న‌ట్టుగా ఫైట్ చేసుకున్నాయి.  దాదాపుగా ఏడు నిమిషాల‌పాటు ఈ ఫైట్ జ‌రిగింది.  ముంగీస చేతిలో చావుదెబ్బ‌లు తిన్న పాము అక్క‌డి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది.  అయినా స‌రే ముంగీస మాత్రం పామును వ‌ద‌ల్లేదు.  దీనికి సంబందించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.