పాము బుస కొడుతుంది.. పాము పగబడుతుంది..! ఎక్కడి వెళ్లినా వెంటపడుతుంది..! తనకు అపాయం తలపెట్టిన మనిషి గొంతు వింటేనే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి కాటు వేస్తుంది..! ఆ వ్యక్తినే కాదు.. వారికి సంబంధించిన వారిని కూడా విడిచిపెట్టదు..! ఇలా పాముల గురించి.. మరీ ముఖ్యంగా నాగుపాముల గురించి ఇలాంటి స్టోరీలు ఎన్నో చెబుతారు.. అయితే, ఓ పాము దాదాపు 10 వేల ఇళ్లకు కరెంట్ నిలిపివేసింది.. పాము కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. చాలా సంస్థలు, కంపెనీలు కొన్ని గంటల పాటు పనిచేయకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇంతకీ ఆ పాము ఏం చేసింది..? పాము విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల జపాన్‌లోని దాదాపు 10,000 ఇళ్లు, ఇతర సంస్థలకు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి పాము వెళ్లింది.. ఆ పాటు అక్కడ చనిపోవడంతో కరెంటు లేకుండా పోయింది. అది ఎలా అంటే.. జపాన్‌లోని ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లోని కొరియామా సిటీలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది.. జూన్ 29న మధ్యాహ్నం 2.10 గంటలకు అత్యంత వేడిగా ఉండే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. తోహోకు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన పరిశోధకులు అసలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి కారణం ఏంటి? అనే కారణాన్ని అన్వేషించగా.. కొన్ని యంత్రాలలో పాము కాలిపోయిన అవశేషాలను కనుగొన్నారు. వారి చెబుతున్న వివరాల ప్రకారం.. పావు లైవ్ వైర్‌ను తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది.. దాంతో, ఆ పాము పూర్తిగా కాలిపోయింది.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పాము కాలిపోవడంతో.. అల్లారం కూడా మోగింది.. ఆ వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక, ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రాంతంలో పవర్ సప్లై పూర్తిగా నిలిచిపోయినట్టు తెలిపారు.
ఇక, దాదాపు 10,000 గృహాలు మరియు వ్యాపారాలకు విద్యుత్‌ను పునరుద్ధరించడానికి సుమారు గంట సమయం పట్టిందని వెల్లడించారు అధికారులు.. అయితే, మధ్యాహ్నం సమయం.. చాలా వేడిగా ఉండంతో.. కొన్ని ఉక్కపోతకారణంగా కొన్ని షాపులు తాత్కాలికంగా మూసివేసినట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి.. కాగా, పాము కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందనే వార్త వైరల్‌గా మారిపోయింది.. ఒక పాము 10 వేల ఇళ్లకు విద్యుత్ కట్ చేయడం ఆసక్తికరంగా మారిపోయింది.. సిటీకి విద్యుత్ సరఫరాను ఒక పాము ఎంత సులభంగా నిలిపివేయగలిగిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.. మొత్తంగా పాము కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పెద్ద చర్చగా మారింది.
