NTV Telugu Site icon

Pushpa 2: “సర్.. నేను పుష్ప 2 సినిమాకు వెళ్తున్నా..” మేనేజర్‌కి ఉద్యోగి మెసేజ్

Pushpa 2

Pushpa 2

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్‌ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్ అయింది. అసలు ఈ సినిమా క్రేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. రిలీజ్‌కు ముందే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వంద కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బుక్ మై షోలో ఏకంగా ముందే 3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

READ MORE: Ponnam Prabahakar: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

తాజాగా ఈ సినిమాకు వెళ్లిన ఓ ఉద్యోగి తన మేనేజర్‌కి పంపిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మెసేజ్ చూసిన నెటిజన్లు ఉద్యోగిని మెచ్చుకుంటున్నారు. ఈ మెసేజ్‌లో ఉద్యోగి.. “సార్, నేను ఈరోజు ఆఫీసుకు రావడం ఆలస్యం అవుతుంది. నేను పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్తున్నాను. నేను సిక్ లీవ్ తీసుకోవచ్చు కానీ నేను తీసుకోవడం లేదు.” అని రాసుకొచ్చాడు.

READ MORE:Patnam Narender Reddy: పోలీసు కస్టడీకి పట్నం నరేందర్‌రెడ్డి..

ఈ స్క్రీన్‌షాట్‌ను ‘లింక్డ్‌ఇన్’ వినియోగదారు అనికేత్ కలారియా డిసెంబర్ 5న పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో “అత్యంత నిజాయితీగల ఉద్యోగి.” అని రాసుకోచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది వినియోగదారులు ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. కొంతమంది యూజర్లు ఉద్యోగి నిజాయితీ మాకు నచ్చిందని చెప్పారు. అయితే మరికొంత మంది మాత్రం దీనికి ఆట్యిట్యూడ్ మెసేజ్‌గా భావిస్తున్నారు. సినిమాలోని ఓ డైలాగ్ మాదిరిగా ఈ మేసేజ్ ఉందని పేర్కొంటున్నారు.

Show comments