Site icon NTV Telugu

Josie Peukert: మహాసముద్రంలో డెలివరీ.. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

Mothers

Mothers

మ‌హిళ‌కు త‌ల్లి కావ‌డం ఓగొప్ప వ‌రం.. క‌డుపులో త‌న బిడ్డ క‌ద‌లిక‌లకు ఆనంద‌ప‌డుతూ 9నెల‌లు ఏ క‌ష్ట‌మొచ్చిన ఆనందంగా భ‌రిస్తూ బిడ్డ‌ను జ‌న్మ‌నిస్తుంది త‌ల్లి. త‌న‌కు ఎలాంటి అపాయం కాకుండా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ బిడ్డ‌కు నీడ‌లా తానై వుంటుంది. త‌ను త‌ల్లి కాబోతోంది అన్న‌ప్ప‌టినుంచి డాక్ట‌ర్లు ద‌గ్గ‌ర‌కు వెళ్ళి బిడ్డ‌కు ఎలాంటి అపాయం జ‌ర‌గ‌కుండా మందులు వేసుకుంటుంది. కొంద‌రు ష్కానింగ్ చేసి బిడ్డ ఎలా ఎద‌గుతున్నాడు. క‌ద‌లిక‌ల‌ను చూసి ఆనంద ప‌డుతుంటారు. కానీ… ఓమ‌హిళ దీనికంత‌టికి విరుద్ద‌మ‌నేచెప్పాలి. తాను త‌ల్లి కాబోతున్న అన్న‌ప్ప‌టి నుంచి ఏ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళ‌లేదు. స్కానింగ్ చేయాలేదు. పైగా ఆసుప్ర‌తిలో.. ఇంట్లో కాకుండా డెల‌వీరిని పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి మెడికల్ సహకారం లేకుండా బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

జోసీ ప్యూకర్ట్ (Josie Peukert) (37) అనే యువతి షేర్ చేసిన వీడియోలో.. ఆమె నికారగువాలోని ప్లాయా మజగువాల్ సముద్ర తీరంలో బిడ్డకు డెలివరీ ఇచ్చింది. ఎలాంటి మెడికల్ అసిస్టెన్స్ లేకుండా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. త‌న బిడ్డ‌ను చూసుకుంటూ త‌న నొప్ప‌నిసైతం మ‌రిచి బిడ్డ‌ను ముద్దాడిన వీడియో ప్ర‌తి ఒక్క‌రికి క‌ళ్ల‌ల్లో ఆనంద‌భాష్పాలు కురిపించాయి. వావ్ అంటూ జోసీ.. కంగ్రాట్స్ అంటూ ప్ర‌సంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

అంతేకాదు, ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె ఒక్కసారి కూడా స్కానింగ్ తీయించుకోలేదు. ‘‘ఇది పూర్తిగా సేఫ్‌గా జరిగేందుకు అవసరమైన రీసెర్చ్ అంతా చేసుకున్నాను’’ అని ఆమె చెప్పింది. ఆమె పోస్టే చేసి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది. ఎలాంటి డాక్ట‌ర్ స‌ల‌హాలు, సూచ‌న‌లు లేకుండా త‌నంత‌కుతానే రీసెర్చ్ చేసుకుంటూ పండెంటి బిడ్డ‌ను జ‌న్మ‌నిచ్చిన జోసీని ధైర్యాన్ని మనమూ మొచ్చుకోవాల్సిందే.

Mercedes-Benz: బ్రేక్‌లో సమస్య.. 10 లక్షల బెంజ్ కార్లు వెనక్కి

Exit mobile version