Site icon NTV Telugu

Video Viral: ఏకంగా నక్కనే మింగేసిన కొండచిలువ.. వీడియో వైరల్

Python

Python

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక భారీ కొండచిలువ ఒక నక్కను మింగి, కొద్దిసేపటికే దాన్ని మళ్లీ బయటకు వదిలేసింది. నక్క చాలా పెద్దగా ఉన్నట్లుంది.. కాసేపటికే ఉమ్మేసింది. ఈ కొండచిలువ దాదాపు 12 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని బలేదిహా గ్రామ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు ఆ పామును చూసి ఆశ్చర్యపోవడంతో పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ తన దవడలను పూర్తిగా తెరిచి పెద్ద నక్కను మింగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

READ MORE: Atchannaidu: జగన్ ప్రతిపక్ష నేత కాదు.. ఒక పార్టీకి అధినేత, ఓ ఎమ్మెల్యే మాత్రమే..

వీడియోలో కొండచిలువ నక్కలో సగ భాగాన్ని మింగినట్లు కనిపిస్తుంది. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్నట్లు చూడొచ్చు. నక్క తలను మింగేసి, దాని వెనుక భాగాన్ని మాత్రమే మింగడానికి ప్రయత్నిస్తున్నట్లు క్లిప్‌లో కనిపిస్తుంది. కానీ దానిని మింగేటప్పుడు పాము పరిస్థితి చాలా దారుణంగా మారింది. అనంతరం ఆ ఎరను పాము బయటకు వదిలేస్తున్నట్టు కనిపించింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. “జూలై 2న జార్ఖండ్‌ రాష్ట్రం గిరిదిహ్ జిల్లా బలేదిహా గ్రామం సమీపంలోని అడవిలో దాదాపు 12 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ ఒక నక్కను సజీవంగా మింగేసింది. ఈ సంఘటనను పక్కనే ఉన్న చాలా మంది వ్యక్తులు తమ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. చిన్న కొండచిలువలు ప్రతి 5–10 రోజులకు ఒకసారి తింటాయి. కొన్ని కొండచిలువలు ప్రతి 10–14 రోజులకు లేదా 3–4 వారాలకు ఒకసారి తింటాయి. పెద్ద పెద్ద కొండచిలువలు అరుదుగా ఒకటి నుంచి రెండు నెలలకు ఒకసారి తింటాయి. అవి తమ తలల వెడల్పు కంటే 10 రెట్లు నోరు తెరవగలవు. జింక అంత పెద్ద జంతువులను ఒకేసారి మింగగలవు.” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

Exit mobile version