Site icon NTV Telugu

Three-Wife Wedding: ఉత్తమ భార్యలంటే మీరే తల్లి.. మొగుడికి దగ్గరుండి మూడో పెళ్లి

Untitled Design

Untitled Design

సాధారణంగా ఒక భార్యను పోషించాలంటేనే చాలా కష్టం అవుతుంది. అందులో మళ్లీ పిల్లలు ఉంటే ఖర్చులు ఎక్కువే. ఏ భార్య అయినా తన భర్త శ్రీరామ చంద్రుడిలా ఉండాలనుకుంటుంది. తన సవతిని తీసుకువస్తే.. చీల్చి చెండాడేస్తది. కానీ ఇక్కడో వింత జరిగింది. అదేంటంటే.. భార్యలే దగ్గరుండి మరీ భర్తకు మూడో పెళ్లి చేశారు. విన్న మీరే ఇంత షాక్ అయితే.. మూడో పెళ్లికి ఒప్పుకున్న ఆ భర్త ఇంకెంత షాక్ అయ్యాడో చూడాలి మరీ.. పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది…

Read Also: Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు…

సోషల్ మీడియాలో వింతలకు కొదువ లేదు. ఎంత స్క్రోల్ చేస్తే అన్ని వింతలు, విశేషాలు చూడొచ్చు. నవ్వుకోవచ్చు. ఏడవొచ్చు. షాక్ కూడా కావొచ్చు. ఇలాంటిదే ఈ పోస్ట్ కూడా. ఓ వ్యక్తికి ఆల్రెడీ ఇద్దరు భార్యలు ఉండగా.. దగ్గరుండి మరో అమ్మాయితో భర్తకు మూడో పెళ్లి చేస్తున్నారు. ఊర్లో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి.. అతిథులను ఆహ్వానించారు. పేపర్‌లో యాడ్స్ కూడా వేయించారు.

Read Also: ముసలోడికి దసరా పండగే.. లేట్ వయసులో తండ్రి కాబోతున్న వృద్ధుడు

‘పండన్న వెడ్స్ లావ్య’ అంటూ పెళ్లి చేసుకోబోతున్న వధూవరుల ఫొటోలతో సహా పేర్లను బ్యానర్‌పై రాయించారు. వివాహానికి ఆహ్వానిస్తున్న ఇద్దరు భార్యల పేరు పార్వతమ్మ, అచ్చలమ్మ‌గా ఉన్నాయి. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అవాక్కయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఆ గుండె బతకాలిరా అంటూ.. మెసేజ్ పెడితే.. మరికొందరు వాడు మగాడ్రా బుజ్జి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version